రామ్ చరణ్ హీరోయిన్ కోసం సెట్లో ఫిజియోథెరపిస్టు
తన తండ్రి మరణంతో కొన్నాళ్లు షూటింగ్‌కు దూరంగా ఉన్న ప్రియాంక ఇటీవలే మళ్లీ చిత్రీకరణకి హాజరైంది. అయితే మేరీ కోమ్ పాత్రను పోషించడం ఎంత కష్టమో ఆమెకు అర్థమైంది. ఒక సన్నివేశం పూర్తి చేసేసరికి ప్రియాంకకి చేతులు నొప్పిపుడుతున్నాయి.
తదుపరి సన్నివేశానికి సిద్ధమయ్యేందుకు ఇబ్బందిపడుతోంది. అందుకే దర్శకుడు ఒమంగ్ కుమార్ ఆమె కోసం ఓ ఫిజియోథెరపిస్టును సెట్‌లో ఉంచుతున్నారు. సన్నివేశానికి సన్నివేశానికి మధ్యలో ప్రియాంకతో కొన్ని వ్యాయామాలు చేయిస్తున్నారు.
అయితే షెడ్యూల్ పూర్తయ్యాక వచ్చే విరామంలోనూ చేతుల నొప్పి ప్రియాంకను ఇబ్బందిపెడుతోంది. దాంతో ఆ సినిమా పూర్తయ్యే వరకూ ఫిజియోథెరపిస్టు తన వెంటే ఉండేలా ఏర్పాట్లు చేసుకొంది ప్రియాంక.
మేరీకోమ్ నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా మేరీకోమ్ అతిథి పాత్రను పోషించబోతోంది. మేరీకోమ్ జీవితంలోని భిన్న పార్శాల్ని తెలుసుకోవడానికే నాలుగు నెలల పాటు మణిపూర్‌లో వుండాలని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక చోప్రా తెలిపింది. ఓ తాలూకు పాత్ర వాస్తవకోణాల్ని తెలుసుకోవడానికి నాలుగు నెలల సమయం వెచ్చించడం నటన పట్ల ప్రియాంక చోప్రాకున్న అంకితభావానికి నిదర్శనమని చిత్ర వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications












