twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరీ ఓవర్ అనిపించటం లేదూ...

    By Srikanya
    |

    ముంబై : సినిమావాళ్లు తన ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకురావటం కోసం,పబ్లిసిటీ కోసం చెప్పే మాటలు ఒక్కోసారి చాలా చిత్రంగా అనిపిస్తూంటాయి. రీసెంట్ గా బాక్సింగ్‌ క్రీడాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మేరికోమ్‌' గురించి చిత్రం దర్శకుడు చెప్తున్న మాటలను బాలీవుడ్ మరీ ఓవర్ గా ఉన్నాయని వ్యాఖ్యానిస్తోంది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి మంచి క్రేజ్ సంపాదించిన ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్‌లో ఆసక్తిరేపుతోంది. అయితే దర్శకుడు చెప్పే సినిమా కబుర్లు మాత్రం అతి అనిపిస్తున్నాయంటున్నారు. ఇంతకీ ఇంతలా అతి అనిపించిన వ్యాఖ్యానం ఏమిటీ అంటే...

    ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రని ప్రియాంక చోప్రా పోషించింది. వాస్తవ పరిస్థితులకు సాధ్యమైనంత దగ్గరగా ఈ సినిమాని తెరకెక్కించాలని దర్శకుడు ఓమంగ్‌ భావించారు. ఈ చిత్రంలోని మేరికోమ్‌ వివాహ సన్నివేశాన్ని రియలిస్టిక్‌గా చూపించాలనుకున్నారు. అందుకోసం మేరికోమ్‌ వివాహం రోజున ధరించిన గౌన్‌ను అడిగి తీసుకొన్నారు. దాని ప్రకారం అలాంటిదే మరో గౌన్‌ను డిజైన్‌ చేయించారు. ఇదే విషయాన్ని మీడియాతో చెప్పారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''సినిమాలోని ప్రతి ఫ్రేమూ వాస్తవికతకు దర్పణం పట్టాలని నా ఉద్దేశం. మేరికోమ్‌ వివాహ ఘట్టం సినిమాలో కీలకం. ఆమె భర్త ధరించిన సూట్‌ను డిజైన్‌ చేయడం పెద్ద కష్టం కాదు. ఆమె గౌన్‌ను తీర్చిదిద్దడం ఇబ్బంది అయింది. అలాంటి మెటీరియల్‌ కోసం మా టీమ్‌ చాలా ప్రయత్నించింది. కానీ దొరకలేదు. అయినా సాధ్యమైనంతవరకు ఒరిజినాలిటీ దగ్గరగా ఉండేలా ప్రయత్నించాం. గౌను కోసం చిత్రీకరణ కొంచెం ఆలస్యమైంది''అని చెప్పారు.

    Priyanka Chopra's reel wedding gown has a Mary Kom touch

    ప్రియాంక మాట్లాడుతూ ''బాగ్‌ మిల్కా బాగ్‌'తో ఈ చిత్రాన్ని పోల్చలేం. ఎందుకంటే ఓ క్రీడాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. క్రీడా చిత్రాల్లో ఓ ట్రెండ్‌ అనడం ఈ చిత్రాన్ని అగౌరవపరచడమే. దేశం గర్వించదగ్గ చిత్రం'' అని చెప్పింది.

    అలాగే...ఈ చిత్రం ఈ చిత్రాన్ని మామూలు రెగ్యులర్ సినిమాల్లా పరిగణించవద్దని ఆమె కోరింది. తన నట జీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు ఏ సినిమాకూ కష్టపడలేదని తెలిపింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించటమంటే మాటలు కాదని, అటువంటి అద్బుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంత పొగడ్తల్లో ముంచెత్తింది.

    ఇక ఈ చిత్రంలో మేరిలీ శరారీకృతిని ప్రదర్శించటానికి రోజుకు పదిహేను గంటలు పాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. భాక్సింగ్ లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి భాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్ధాయిలో మన దేశ కీర్తి పతాకం ఎగిరేలా ఒలింపిక్స్ లో పతకం సాధించిందని వివరించింది. ఈ చిత్రానికి దర్శకుడు ఒమాంగ్ కుమార్. సెప్టెంబర్ ఐదున ఈ చిత్రం విడుదల కానుంది.

    English summary
    Priyanka Chopra's makeover as Mary Kom in the recently released poster and trailer of the upcoming film of the same name invited mixed response from the audience, but, Piggy Chops wants to take the maximum possible cues from the Olympian boxer's life in the biopic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X