»   » ‘తుఫాన్’ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటర్య్వూ...

‘తుఫాన్’ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటర్య్వూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 'తుఫాన్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఆమె రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ మూవీ 'జంజీర్'కు ఇది తెలుగు వెర్షన్. 1975లో అమితాబ్ బచ్చన్ హోరోగా వచ్చిన 'జంజీర్' చిత్రాన్ని అదే పేరుతో ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేసారు. ఈ నేపథ్యంలో ఆమె తులుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలను ఓ సారి చూద్దాం..

‘తుఫాన్’ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటర్య్వూ...

‘తుఫాన్’ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటర్య్వూ...

హాయ్ ప్రియాంకా హౌ ఆర్ యూ?
ప్రియాంక : యా గుడ్

తెలుగులో ‘తుఫాన్' మీకు తొలి చిత్రం. ఎలా ఫీలవుతున్నారు?

తెలుగులో ‘తుఫాన్' మీకు తొలి చిత్రం. ఎలా ఫీలవుతున్నారు?

ప్రియాంక : యా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాను. బాలీవుడ్లో బిజీగా ఉండటం వలన కొన్ని కారణాల వలన తెలుగులో నటించడం కుదరలేదు. ఇప్పుడు తుఫాన్ లాంటి హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంన్నందుకు హ్యాపీగా ఉంది.

1975 నాటి జంజీర్‌లో జయా బచ్చన్ పోషించిన పాత్రను మీరు ఇప్పుడు చేస్తున్నారు. దర్శకుడు అపూర్వ లఖియా మీ పాత్రలో ఎంత వరకు మార్పులు చేసారు?

1975 నాటి జంజీర్‌లో జయా బచ్చన్ పోషించిన పాత్రను మీరు ఇప్పుడు చేస్తున్నారు. దర్శకుడు అపూర్వ లఖియా మీ పాత్రలో ఎంత వరకు మార్పులు చేసారు?

ప్రియాంక : నేను మీతో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఈచిత్రం ద్వారా జయా బచ్చన్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయా బచ్చన్ గారి పాత్ర జంజీర్ చిత్రంలో మొదటి నుంచి ఆమె ‘చాకు చూరీ వాలీ' అనే వీధి అమ్మాయి పాత్ర పోషించారు. తుఫాన్ చిత్రంలో నా పాత్ర పేరు మాల, సినిమా అంతా కొత్తగా కనిపిస్తుంది. ఆమె న్యూయార్క్‌కు చెందిన అమ్మాయి. ఒక వివాహానికి హాజరయ్యేందుకు భారత్ వస్తుంది. ఇందులో నా మొదటి సన్నివేశం నేను ఒక హత్యను చూడటం వలన కొందరు రౌడీలు నా పై కత్రితో వెంటపడుతుంటారు. ఆ హత్యను చూసిన మాల సాక్ష్యం చెప్పడానికి ఏసిపి విజయ్(రామ్ చరణ్)ని కలుస్తుంది. అప్పటి నుంచి మాల పాత్ర మొత్తం ఇండియాలోనే సాగుతుంది.

ఈ చిత్రం తెలుగులో షూటింగ్ జరిగింది కదా, మీకు తెలుగు లైన్లు లిప్ మూమెంట్ ఇవ్వడానికి కష్టం అనిపించిందా?

ఈ చిత్రం తెలుగులో షూటింగ్ జరిగింది కదా, మీకు తెలుగు లైన్లు లిప్ మూమెంట్ ఇవ్వడానికి కష్టం అనిపించిందా?

ప్రియాంక : అది నిజంగా చాలా కష్టం కలిగింది. అందులోనూ ఈ చిత్రంలో మాల పాత్ర బాగా వాగుడుకాయ. హిందీ వరకూ డబ్బింగ్ ఫర్వాలేదు కానీ, తెలుగులో డైలాగ్స్ పెద్దవి. అవి చెప్పడానికి కఠినంగా అనిపించినా అది నాకు ఒక పరీక్షలా భావించాను. ఆ డైలాగులు నేర్చుకునేప్పుడు రామ్ చరణ్ నాకు హెల్ప్ చేసాడు. రియల్లీ థాంక్స్ టూ రామ్ చరణ్.

తెలుగులో రామ్ చరణ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో, అతనితో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు, అతనిపై మీ అభిప్రాయం?

తెలుగులో రామ్ చరణ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో, అతనితో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు, అతనిపై మీ అభిప్రాయం?

ప్రియాంక : రామ్ చరణ్ వెరీ గుడ్ కోస్టార్. వెరీ గుడ్ యాటిట్యూడ్ అండ్ వర్క్ డెడికేట్ ఉన్న ఆర్టిస్ట్. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ అతని డాన్స్‌ సూపర్బ్‌గా ఉంటుంది. తప్పకుండా బాలీవుడ్లో రామ్ చరణ్ తన మొదటి సక్సెస్ సాధిస్తున్నాడు. ఏసీపీ విజయ్ ఖన్నాగా రామ్ చరణ్ చేసిన నటన నాకు చాలా నచ్చింది. డైలాగ్స్ చాలా మంచి మాడ్యులేషన్‌తో చెప్పారు. కసి ఉన్న అతికొంత మంది నటుల్లో రామ్ చరణ్ ఒకరు.

దర్శకుడు అపూర్వ లఖియా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?

దర్శకుడు అపూర్వ లఖియా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?

ప్రియాంక : పెంటాస్టిక్ దర్శకుడు ఆయన, అపూర్వ లఖియా పెర్పెక్షన్ ఉన్న దర్శకుడు. ప్రతి విషయంలో క్లారిటీగా ఉంటారు. అమితాబ్ చేసిన జంజీర్ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడం అంటేనే ఆయన డేర్ తెలుస్తుంది. అంతే కాదు రీమేక్ కదాని మక్కికి మక్కి చెయ్యలేదు. కథను మాత్రమే తీసుకుని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. రేపు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అపూర్వ గురించి మాట్లాడుకుంటారు.

సినిమా ఆడియోని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

సినిమా ఆడియోని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

ప్రియాంక : రీసెంట్ టైమ్స్ లో గుడ్ ఆడియో అనే చెప్పాలి. నేను మాత్రం నా పింకి సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను.

ఫైనల్‌గా తుఫాన్ సినిమా గురించి మీ అభిప్రాయం?

ఫైనల్‌గా తుఫాన్ సినిమా గురించి మీ అభిప్రాయం?

ప్రియాంక : జంజీర్ లాంటి సూపర్బ్ కథని రీమేక్ గా తీసిన సినిమా ఇది. అపూర్వ లఖియా దర్శకత్వం, రామ్ చరణ్ నటన, డాన్స్..అఫ్ కోర్స్ నా గ్లామర్‍‌తో పాటు శ్రీహరి, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్ బాగా నటించారు. మహిగిల్ సాంగ్ కూడా సినిమా హైలెట్‌గా నిలుస్తుంది. ఇన్ని హైలెట్స్‌తో సెప్టెంబర్ 6న మీ ముందుకు వస్తున్న తుఫాన్ చిత్రం అలరిస్తుందని నమ్ముతున్నాను.

English summary
Priyanka Chopra 'Toofan' Interview. Zanjeer titled Thoofan in Telugu. The film directed by Apoorva Lakhia, shot simultaneously in Hindi and Telugu. The film marks the Bollywood debut of Tollywood actor Ram Charan in the lead role along with Priyanka Chopra. The release date is scheduled for September 6, 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu