»   » నిజంగా ఈ క్రెడిట్ చైతన్యదే...అశ్వనీదత్ కుమార్తె

నిజంగా ఈ క్రెడిట్ చైతన్యదే...అశ్వనీదత్ కుమార్తె

Posted By:
Subscribe to Filmibeat Telugu

మా సంస్థ నిర్మించిన 'బాణం' చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికయినందుకు చాలా ఆనందంగా ఉంది. థాంక్స్ టూ జ్యూరీ మెంబర్స్. నిజంగా ఈ క్రెడిట్ మా చిత్ర దర్శకుడు చైతన్యకు దక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ కావడానికి, మాకు పేరు రావడానికి కారణం ఆయనే అంటూ స్పందించారు అశ్వనీదత్ కుమార్తె శేషు ప్రియాంకదత్. ఆమె స్ధాపించిన త్రీ ఏంజిల్స్ పతాకంపై నిర్మించిన 'బాణం' చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికయినందుకు సంతోషంగా ఇలా మీడియా వద్ద స్పందించారు. అలాగే మా నాన్నగారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్.టి.ఆర్.గారు నటిస్తున్న 'శక్తి' చిత్రం షూటింగ్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాను. ఆ సినిమా విడుదల తర్వాత అన్ని భాషల్లో త్రీ ఏంజిల్స్ పతాకంపై సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఇక 'బాణం' చిత్రం ద్వారా నారా రోహిత్ హీరోగా పరిచయం అయ్యారు. నక్సలిజం, పోలీస్ వ్యవస్ధ ఈ రెండింటి నేఫద్యంలో చిత్ర కథ నడుస్తుంది.

Please Wait while comments are loading...