»   »  ప్రియాంక చోప్రా కి రెండు ఎక్కువే

ప్రియాంక చోప్రా కి రెండు ఎక్కువే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Priyanka Chopra
ద్వి,త్రి పాత్రాభినయనాలు పోయి దశావతారాలు స్కీమ్ లు వచ్చేసాయి.ఇప్పుడు హీరో,హీరోయిన్స్ అంతా తాము రకరకాల గెటప్స్ లో కనపడాలనే కొత్తపిచ్చి పట్టుకుని తిరుగుతున్నారు.అందుకు తగ్గట్లే వారి డేట్స్ పట్టుకోవటానికి దర్శక,నిర్మాతలు కూడా గెటప్స్ ఫొటోషాప్ లో డిజైన్ చేయించి చూపి కథలు చెపుతున్నారనేది పచ్చి నిజం.ఈ కోవలో ప్రస్తుతం బాలీవుడ్ ప్రియాంక చోప్రా చేరబోతోంది.లగాన్ దర్శకుడు అశుతోష్ రూపొందించే కొత్త చిత్రంలో ఆమె పన్నెండు పాత్రల్లో కనిపించనుందని రూఢీగా తెలుస్తోంది.

ఇంతకు ముందే కమర్షియల్ ప్రయోగమంటూ బవేజ్ చేసిన 'లవ్ స్టోరీ 2050' లో ఆమె ప్యూచిరిస్టిక్ మహిళగా చేసింది.అయితే అందులో ఆమె వేసిన వైరైటీ గెటప్స్ ఒక్క షోను కూడా నిలబెట్టలేకపోయాయి. కానీ ఆమె ఇప్పడామెను అశుతోష్ అధ్భుతంగా చూపెట్టటానికి ప్లాన్ చేసారని,ఆ పాత్రలు కూడా కథలో కలిసి ప్రయాణం చేస్తాయని చెప్తున్నాయి.అయితే ఆ సినిమా మరాఠీ కథ రాశిచక్రం ఆధారంగా తయారు చేసారనే వాదనను ఆయన కొట్టి పారేస్తున్నారు.ఫ్రముఖ రచయిత మధురే రాసిన 'కింబల్ రావెన్స్ వుడ్' ఆధారంగా చిత్రం కథ తయారైందని ఆయన చెప్తున్నారు.త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X