»   » ప్రియాంక కొఠారి ప్రధానపాత్రలో రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం ..

ప్రియాంక కొఠారి ప్రధానపాత్రలో రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ పరచయం చేసి ఆయన క్యాంప్ లోనే కొనసాగుతున్న ప్రియాంక కొఠారికి బయిట ఎక్కడా ఆపర్స్ రావటం లేదు. దాంతో వర్మ మరోసారి ఆమెకు స్ట్రాకర్ అనే చిత్రంతో ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. కిషోర్ భార్గవ అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతన్నాడు.కిషోర్ భార్గవ గతంలో డార్లింగ్ చిత్రం సమయంలో వర్మ వద్ద పనిచేసారు.రామ్ గోపాల్ వర్మ స్క్ర్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం అని చెప్తున్నారు. ఓ వారంలో ఈ కొత్త చిత్రం ముంబైలో ప్రారంభం కానుంది. తెలుగులోనూ డబ్బింగ్ చేసి ఈ చిత్రాన్ని విడుదలచేస్తారు. ఇక ప్రస్తుతం వర్మ బెజవాడ రౌడీలు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వర్మ శిష్యుడు వివేక్‌కృష్ణ డైరక్ట్ చేస్తున్నారు. వందిత కోనేరు సమర్పణలో శ్రేయ ప్రొడక్షన్‌ పతాకంపై రామ్ ‌గోపాల్‌ వర్మ, కిరణ్‌ కుమార్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ గురువారం విజయవాడలో ప్రారంభమైంది. ఇక ప్రియాంక కొఠారి గతంలో వర్మ తో అశోసియేట్ అయి..మధ్యాహ్నం హత్య, జేమ్స్, సర్కార్, గో, ఆగ్, అడవి చిత్రాల్లో చేసింది.

English summary
Priyanka Kothari features in Stalker, the directorial debut of Kishore Bhargav, who assisted Ramu during Darling. Though Ramu is not the producer of the film, he has helped Kishore put together the project. Priyanka plays a girl who is being stalked. The film goes on floor next week and will be shot in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu