For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియాంకా కిస్ మిక్స్ టేస్ట్

  By Staff
  |

  Nisha Kothari
  ప్రియాంక కొఠారికి రామ్ గోపాల్ వర్మ సినిమాలో చేస్తే ఎక్కడలేని ఉషారు వచ్చేస్తుంది. తాజాగా ఆమె నితిన్ ప్రధాన పాత్రలో చేస్తున్న 'అజ్ఞాత్‌' చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రంలో లో ఒక పాటను మాత్రమే పెట్టాలని తొలుత వర్మ అనుకున్నారు. తాజాగా ప్రియాంక కొఠారిపై 'కిస్‌ మిక్స్‌' అంటూ సాగే పాటను తెరకెక్కించారు. ఇంతకీ ఈ పాటను కేవలం ప్రియాంక కొఠారి మీదే చిత్రీకరించారా? ఇదే ప్రశ్న ప్రియాంకని అడిగితే "పాటలోనేమో కిస్‌ మిక్స్‌ అనే పదాలు వినిపిస్తున్నాయి. ఒక్కరి మీదే ఈ పాటను చిత్రీకరిస్తే..ముద్దులెక్కడ ఉంటాయి చెప్పండి? అందుకే ఇందులో ఓ మగాడు కూడా నాతో పాటు డాన్స్ చేస్తాడు. అతడెవరన్నది ఇప్పుడే చెప్పను. మీరే ఎదురు చూడండి" అంది.

  ఇక ఎప్పుడూ ఏదో ఒక సంచలనమో, కొత్తదనమో కోరుకునే వర్మ ఈసారి పట్టుదలగా 'అజ్ఞాత్' అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేజర్ పార్ట్ శ్రీలంకలోని సిగిరియా అడవుల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఓ క్రైమ్ థ్రిల్లర్. ఇక స్టోరీ విషయానికి వస్తే అజ్ఞాతంగా ఉంటూ మనుషుల్ని చంపే ఓ శక్తి చుట్టూ అల్లుకొన్న కథ ఇది....ఓ సినిమా యూనిట్...షూటింగ్ కి వెళ్ళి ఓ దట్టమైన అరణ్యంలో చిక్కుకుపోతారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరి హత్యలు జరుగుతూంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలియదు. అలా చంపుతున్నది జంతువా? మనిషా? ఏదైనా ప్రేతాత్మ? అన్నది సస్పెన్స్‌. ఇందులో నితిన్ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నారు.

  ఈ చిత్రం గురించి వర్మ చాలా ఉద్వేగంగా చెప్తున్నారు. ఆయన మాటల్లో..ఏదో తెలియని శక్తి..వరసగా జనాల్ని చంపేస్తూంటే...ఆ విష వలయంలో చాలా మంది చిక్కుకు పోయి ఉంటే...ఇలాంటి కాంసెప్ట్ ఉన్న ధ్రిల్లర్ సినిమాలుకు నేను వీరాభిమానని..అది రెడ్లీ స్కాట్ అధ్బుతం ఎలియన్ సినిమా కావచ్చు,జాన్ కార్పెంటర్ డైరక్ట్ చేసిన ధి ధింగ్ అయ్యిండవచ్చు. అయినా బ్లెయిర్ విచ్ ప్రాజెక్టు సినిమాని మరిచిపోగమా...అందులో చివరివరకూ నెగిటివ్ పాత్ర ఎవరో తెలియదు. అలాంటి కథనమే నా చిత్రంలోనూ ఉంటుంది కాబట్టే నా చిత్రానికి అజ్ఞాత్ అని పేరు పెట్టాను. అజ్ఞాత్ అంటే తెలియని అని అర్ధం. ఇక ఇలాంటి థ్రిల్లర్స్ ఇతర దేశాల్లో చాలా పాపులర్. ఇక్కడ డబ్బింగ్ అయి కూడా ఆ సినిమాలు పెద్ద విజయాన్నే సాధించాయి. అయితే ఇప్పటివరకూ ఇలాంటి జెనర్ గల సినిమాని సీరియస్ గా ఇండియాలో ఎవరూ ఎటెమ్ట్ చేయలేదు. అందుకే నేను ఈ సినిమా తీస్తున్నా. ఈ సినిమాలో ఎమోషనల్ కాంప్లెక్స్ లు, ఎక్స్టీమ్ భయం చూపెట్టాలనుకుంటున్నా.

  అలాగే ప్రత్యేకంగా ఆ శ్రీలంక అడవినే లొకేషన్ గా ఎంచుకోవటానికి కారణం వర్మ వివరించారు. నేను ఎప్పుడూ సినిమా లొకేషన్ కూడా ఓ క్యారెక్టర్ గానే భావిస్తాను. సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే దాని ప్రాధాన్యత దానికుంటుంది. ఈ హిందీ సినిమా షూటింగ్‌ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేయాలనుకొంటున్నారు. వర్మ సినిమాల్లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ మోతాదులో ఉండే చిత్రం ఇదే కావచ్చు. వర్మకిష్టమైన ధ్రిల్లర్ ఫార్మెట్ లో ఈ చిత్రం నడుపుతున్నాడు కాబట్టి సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉందని ఆయన అభిమానులు అప్పుడే ఎదురుచూడటం ప్రారంభమైంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X