»   » హార్రర్ లుక్ లో కూడా ఇంత సెక్సీగా: ప్రియాంకా బేవాచ్ కొత్త లుక్ అదిరింది

హార్రర్ లుక్ లో కూడా ఇంత సెక్సీగా: ప్రియాంకా బేవాచ్ కొత్త లుక్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బేవాచ్ ఫిల్మ్ లో అందాలు ఆరబోయనున్న ప్రియాంక చోప్రా కొన్ని సీక్రెట్స్ చెప్పింది. ఆ హాలీవుడ్ ఫిల్మ్ లో తన పాత్ర క్రూరంగా ఉంటుందని తెలిపింది. తానో రాక్షసినని, అమెరికా తనను అసహ్యించుకోవడం ఖాయమని చెప్తే ఎమో అనుకున్నాం గానీ కొత్తగా పోస్ట్ చేసిన ఫొటోతో తన కౄరత్వాన్ని బయట పెట్టింది ప్రియాంకా చోప్రా. 1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే పేరుతో ప్రస్తుతం సినిమాని రూపొందిస్తున్నారు. కాకతాళీయంగానే అయినా ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ ప్రియాంక ఎంట్రీ మాత్రం విలన్‌గానే జరగటం విశేషం.

గతం లో కూడా ఇదే విషయంపై ప్రియాంక స్పందిస్తూ, '2015లో ఈ స్క్రిప్ట్‌ విషయమై దర్శకుడు నాతో సంప్రదించారు. ప్రముఖ హాలీవుడ్‌ నటుడి కోసం ఆయన విలన్‌ పాత్ర రాసుకున్నారు. అది కేవలం మగాళ్ళు మాత్రమే నటించే పాత్ర. స్క్రిప్ట్‌ విన్న తర్వాత ఇందులో ఓ మంచి పాత్ర కావాలని ఆడిగాను. ప్రతినాయకుడి పాత్రకి బదులు ప్రతినాయకిగా నేను నటిస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఆయన చెప్పిన ఐడియా నాకూ నచ్చింది. దీంతో విలన్‌గా నటించేందుకు గ్రీన్‌స్నిగల్‌ ఇచ్చాన'ని చెప్పినప్పింది కూడా.

Priyanka shared a special Halloween poster of her ‘Baywatch’

అటు హాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూనే ఇటు బాలీవుడ్ లోనూ సినిమాలను ఒప్పుకుంటూ బిజీ బిబిజీ గా ఉన్న ఈ సొగసరి తన 'బేవాచ్" సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర పోజ్ ను ట్వీట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. బ్లాక్ స్లిట్ డ్రస్.. గన్..లతో గబ్బిలాన్ని పోలినట్టున్న ఈ భామ పిక్చర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎర్రటి పెదాల చివరి నుంచి రక్తం కారుతున్న ఈ ఫొటో సినిమాలో పీసీ ఎంతటి క్రూరత్వం ప్రదర్శిస్తుందో చెప్పకనే చెప్పేస్తోంది.

ఈ అందాల రాక్షసి ఫోజులో ఉన్న హారర్ ఫొటోని హాలోవీన్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రియాంక ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 'బేవాచ్" మూవీ టైటిల్ కింద ''ముందడుగేయండి, చెడ్డవాళ్లుగానే ఉండండి"" అనే ట్యాగ్ లైన్ ప్రియాంక పిక్చర్ కు అతికినట్టు సరిపోయింది. హాలీవుడ్ తొలి మూవీలోనే విలన్ రోల్ పట్టేసిన ప్రియాంకా చోప్రా 'ఐత్ రాజ్" అనే హిందీ సినిమాలోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి మెప్పించింది. హాలీవుడ్ లోనూ అదే సెంటిమెంట్ తో మొదలు పెట్టటం తో ఇక్కడ కూదా పాత హిస్టరీ రిపీట్ చేసేందుకు అమ్మడు ఉత్సాహపడిపోతోంది. క్వాంటికో సిరీస్ తో ఎలాగూ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా 'బేవాచ్'తో హాలీవుడ్ ని కూడా ఒక ఊపు ఊపేయాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.

English summary
The ‘Quantico’ star shared a special Halloween poster of her ‘Baywatch’ character, and she looks deliciously wicked!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu