»   » ‘మహానటి’ టీంకు అల్లు అరవింద్ గ్రాండ్ పార్టీ... బన్నీ, రాజమౌళి సందడి (ఫోటోస్)

‘మహానటి’ టీంకు అల్లు అరవింద్ గ్రాండ్ పార్టీ... బన్నీ, రాజమౌళి సందడి (ఫోటోస్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Allu Arvind Hosted Party For Mahanati Team

  ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. సినిమా విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. యూఎస్ఏలో ఈ చిత్రం ఐదు రోజుల్లోపే 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం వసూళ్లు అదుర్స్ అనే విధంగా ఉన్నాయి. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు గొప్ప సినిమా తీశారంటూ ప్రముఖుల నుండి, సినీ విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చిరంజీవి చిత్ర బృందాన్ని సత్కరించగా, తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

  అల్లు అర్జున్, రాజమౌళి సందడి

  అల్లు అర్జున్, రాజమౌళి సందడి

  అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో మహానటి నిర్మాతలు అశ్వినీ దత్, ప్రియాంక దత్‌, స్వప్నదత్‌తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ పార్టీలో అల్లు అర్జున్, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి సైతం పాల్గొని సందడి చేశారు.

  గర్వపడే సినిమా తీశారంటూ బన్నీ కామెంట్

  గర్వపడే సినిమా తీశారంటూ బన్నీ కామెంట్

  ‘మానాన్న గారు ఆయన స్నేహితుడు, భాగస్వామి అశ్వినీ దత్‌గారికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ‘మహానటి' లాంటి ఎంతో గొప్ప సినిమాను ప్రేక్షకులకు అందించారాయన, దర్శకుడు నాగ్ అశ్విన్ మనమంతా గర్వపడే సినిమా తీశారు. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్.... అంటూ అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు.

  మెగాస్టార్ చిరంజీవి సైతం

  మెగాస్టార్ చిరంజీవి సైతం

  ‘మహానటి' చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల సత్కరించిన సంగతి తెలిసిందే. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ టాలెంట్‌ను మెచ్చుకున్నారు.

  తమిళంలో కూడా సూపర్ హిట్

  తమిళంలో కూడా సూపర్ హిట్

  ‘మహానటి' చిత్రం తమిళంలో నడిగైయార్ తిలగం పేరుతో విడుదలైంది. తమిళనాడులో కూడా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లు సాధిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు.

  English summary
  Popular producer Allu Arvind, who owns Geetha Arts, hosted a private party for the makers of Mahanati to celebrate the success of the film, which was a sweet gesture from the veteran producer. The party was attended by producers Aswini Dutt, Swapna Dutt and Priyanka Dutt along with director Nag Ashwin. Actor Allu Arjun too graced the party and posted a picture on his social networking page late in the night yesterday. Baahubali director S.S.Rajamouli too attended the event along with music composer M.M.Keeravani.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more