»   » డ్రగ్స్ కేసులో అరస్టైన నిర్మాత, అసెస్టెంట్ డైరక్టర్, వర్మ సినిమాకు పనిచేసాడా?

డ్రగ్స్ కేసులో అరస్టైన నిర్మాత, అసెస్టెంట్ డైరక్టర్, వర్మ సినిమాకు పనిచేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతంలో చాలా సార్లు డ్రగ్స్ కేసులో సినిమావాళ్ళు ఇరుక్కోవటం చూసాం. ఇప్పుడు మరోసారి ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక సినీనిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండటమే హాట్ టాపిక్ గా మారింది.

నెల్లూరుకు చెందిన వెంకట సురేష్ అనే వ్యక్తి, యూసుఫ్‌గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి విద్యార్థులకు డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నించారు. ఇతడు ఇంతకుముందు రాంగోపాల్ వర్మ సినిమాకి పని చేసినట్లు తెలిసింది.

Producer and Asst. Director Caught in Drug Case

నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి, అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ. 6 కోట్లని అంచనా వేశారు. కొకైన్ గ్రాము 5-10 వేల వరకు అమ్ముడవుతుంది. సైబరాబాద్ పరిధిలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు. ఇంతకుముందు ఒక సైంటిస్ట్ ని అరెస్టుచేసి, అతడి వద్ద వందల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

English summary
Tollywood Producer and Asst. Director Caught in Drug Case. A special police team tracking drug peddlers in city kept tab on their movements.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu