»   » సెన్సార్ ఆఫీసులో నిర్మాత ఆత్మహత్యాయత్నం

సెన్సార్ ఆఫీసులో నిర్మాత ఆత్మహత్యాయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Producer attempts suicide in Censor Office
హైదరాబాద్: తన సినిమాకు సెన్సార్ సమస్య రావటంతో మనస్తాపం చెందిన ఓ నిర్మాత ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. నిన్న(బుధవారం) సెన్సార్ ఆఫీసుకు వెళ్లిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు అక్కడే నిద్ర మాత్రలు మింగారు. అయితే అక్కడ వారు ఆయన్ని వెంటనే హాస్పటిల్ కి తీసుకు వెళ్లి జాయిన్ చేసారు. ఆయన ప్రస్తుతం అమ్మా నాన్నా ఊరిళితే చిత్రం నిర్మిస్తున్నారు. ఆయనతో సెన్సార్ ఆఫీస్ వ్యవరించిన తీరుకు నిరసనగా ఈ ఆత్మహత్యా ప్రయత్నం చేసారని తెలుస్తోంది.

అమ్మా నాన్నా ఊరిళితే చిత్రానికి జనవరిలో సెన్సార్ జరిగింది. అయితే రీజనల్ సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి నలభై కట్స్ ఇచ్చారు. షాక్ అయిన దర్శకుడు,నిర్మాత ఆమెను ఒప్పించి కట్స్ తగ్గించటానికి ప్రయత్నించారని,రివ్యూ కమిటిని సైతం ఎప్రోచ్ అయ్యారని అయితే ఫలితం లేకుండా పోయిందని సమాచారం. దాంతో నిర్మాత తనకు ఇక ఈ సినిమా అన్ని కట్స్ తో విడుదలైతే నష్టాలు తప్పవని భావించే ఇలాంటి విషాదకరమైన నిర్ణయిం తీసుకున్నాడని చెప్తున్నారు.

నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ...మా సినిమాకు మేము ఊహించని విధంగా 40 కట్స్ ఇవ్వడంతో మేము షాక్ కు గురయ్యాము. సెన్సార్ బోర్డు వారు మా వివరణ కూడా పట్టించుకో లేదు అన్నారు.

దర్శకుడు అంజి శ్రీను మాట్లాడుతూ కొన్ని సినిమాలకు చాలా సులువుగా సెన్సార్ దొరుకుతుంది. సెన్సార్ బోర్డు కొంతమంది బడా నిర్మాలకు దాసోహం అయిందేమో అనిపిస్తోంది. సెన్సార్ బోర్డు అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.దీనిపై న్యాయ పోరాటం చేసి అన్ని వివరాలను త్వరలో ఆధారాలతో బయట పెడతాను అన్నారు.

సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ వర్వ, విజయ్,మధు, తేజ, శిల్పాస్విత, మనస్విని, తనూష, సుస్మిత, తదితరులు నటించారు. ఇతర పాత్రల్లో శివకృష్ణ, అపూర్వ, ఎఫ్.ఎమ్ బాబాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కె.వి.రాజు, పాటలు: పోతుల కిరణ్, శ్రీరాం, తపస్వీ, డాన్స్: సుచిత్రా చంద్రబోస్, అమ్మ రాజశేఖర్, వేణుపాల్, కిశోర్, సంగీతం: మున్నాకాశి, ఎడిటింగ్: బుల్‌రెడ్డి, కెమెరా: ఖాదర్, సహ నిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాత: జక్కుల నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజి శ్రీను.

English summary

 Jakkula Nageswara Rao, producer of Amma Naanna Oorelite shocked all by attempting suicide swallowing sleeping pills in Censor Board office. The incident happened with Censor Board officials suggesting more than 40 cuts and calling for scene to scene scrutiny after feeling that the entire film comprised of adult content.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu