»   »  పవన్ కంప్లైంట్ పై నిర్మాత స్పందన

పవన్ కంప్లైంట్ పై నిర్మాత స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అత్తారింటికి దారేదీ' సినిమా రెమ్యూనరేషన్‌ విషయంలో పవన్‌కళ్యాణ్‌ నాన్నకు ప్రేమతో నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ పై 'మా'లో ఫిర్యాదు చేశారు. దీనిపై మీడియావారు ఆయన్ను రీసెంట్ గా అప్ డేట్స్ గురించి ప్రశ్నించారు. దానికి ఆయన సమధానమివ్వటానికి ఇష్టపడలేదు.

"ఈ విషయంపై ప్రస్తుతం డిస్కషన్‌ జరుగుతోంది. అయినా ఇదంతా మా వ్యక్తిగతం. దీనిపై ఇప్పుడు నేనేం మాట్లాడలేను" అంటూ తేల్చి చెప్పారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌. ఎన్టీఆర్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. సంక్రాంతి నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం గురించి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మీడియాలో మాట్లాడారు.

Producer B.V.SN.Prasad On Pawan's Compliant

'నాన్నకు ప్రేమతో.. గురించి మాట్లాడుతూ..

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ...'మొదటి మూడు షోలకు కొద్దిగా డివైడ్‌ టాక్‌ వచ్చింది. కాని మొదటి రోజు సాయంత్రానికే ఫలితం మారిపోయింది.
అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. 'బాహుబలి' లాంటి పెద్ద సినిమాకే మొదటి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. ఆ తర్వాత అది పెద్ద హిట్‌ అయ్యింది. ఈ చిత్రం కూడా అలానే. మొదటి షోతోనే సినిమా ఫలితాన్ని నిర్ణయించలేం. అందుకు మా చిత్రానికి వస్తున్న స్పందనే నిదర్శనం. ఈ చిత్రం ఇప్పటికే 40కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 'అత్తారింటికి దారేదీ' తర్వాత అంత ఎక్కువగా కలెక్ట్‌ చేసిన చిత్రంగా నిలిచింది అన్నారు.

అలాగే...ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం...ఫ్యామిలీ ఎమోషన్స్‌. తండ్రి కోసం ఓ కొడుకు పడే తపన అనే పాయింట్‌ నాకు బాగా నచ్చించి. అందుకే చేశాను. ఫ్రెష్‌ ఫీలింగ్‌ కోసం లండన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో పెట్టాం. అలా పెట్టడం వల్ల ఎన్టీఆర్‌కు మార్కెట్‌ను పెంచడంలోనూ, కలెక్షన్ల పరంగానూ హెల్ప్‌ అయ్యింది అన్నారు.

ఇక సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాల ప్రభావం మీ సినిమా కలెక్షన్ల మీద పడలేదా అంటే...పండుగ రోజు సినిమాను విడుదల చేయడమే పెద్ద ప్లస్‌. ఆ టైంలో కలెక్షన్లు బాగా వస్తాయనే రిలీజ్‌ చేస్తాం. మిగిలిన సినిమాల మాదిరిగానే మా చిత్రం కూడా మంచి కలెక్షన్లనే రాబట్టిందిఅని చెప్పుకొచ్చారు.

ఇక సుకుమార్‌ 'వన్‌' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినప్పటికీ ఆయనతో సినిమా చేయడం రిస్క్‌ అనిపించలేదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ...ఇండిస్టీలో ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌గా సుకుమార్‌ పేరు తెచ్చుకున్నారు. ఆయన చిత్రాల ఫలితం ఎలా ఉన్నా సినిమాల్లో మంచి విలువలుంటాయి. ఆయనతో కలిసి 'ఆర్య 2' చేశాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాను.

అయితే ఈ సినిమా ఫలితంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడొచ్చు. ఇలా చేస్తే బాగుండేదని.. అలా చేస్తే బాగుండేదని..ఇలా ఏవేవో చెబుతుంటారు. ఇండిస్టీలో అందరూ క్రియేటర్సే. మనం సినిమా కథ నచ్చి చేస్తాం. ప్రతి కథ ఆడియెన్స్‌కి కనెక్ట్‌ కావాలని లేదు. వారిని ఆకట్టుకున్న సినిమానే హిట్‌ అవుతుంది. ఇది హిట్‌, ఫట్‌ అని ముందే చెప్పలేం. పైగా సినిమాల్లో మాస్‌, క్లాస్‌ అని కూడా ఉండదు. ప్రేక్షకులకు కథ నచ్చితే ఏ సినిమా అయినా ఆడుతుంది. అని చెప్పుకొచ్చారు.

English summary
Producer B.V.SN.Prasad not intrested to comment On Pawan's Compliant
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu