»   » హటాత్తుగా ఈ ట్వీట్ ఏంటి బండ్ల గణేష్ ?

హటాత్తుగా ఈ ట్వీట్ ఏంటి బండ్ల గణేష్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా ప్రొడ్యూసర్ గా ఎదిగిన తర్వాత బండ్ల గణేష్ కు విలువ హెచ్చింది. ఆయనేం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏం ట్వీట్ చేసినా దానికి ప్రయారిటీ వచ్చి చేరింది. తాజాగా బండ్ల గణేష్ ... స్వర్గస్తులైన అక్కినేని నాగేశ్వరావు గారు ట్వీట్ చేసిన ఓ కోట్ ని రీట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు పనిగట్టుకుని మరీ ఈ ట్వీట్ ఎందుకు చేసారనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే..

'డబ్బు సంపాదించటం అంటే నాకు గౌరవం. ఖర్చు చేయటం అంటే మిత గౌరవం. సద్వినియోగం చేయటం అంటే అతి గౌరవం'

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హఠాత్తుగా ఇలా బండ్ల గణేష్ ...పాత ట్వీట్ ని తీసుకొచ్చి లైవ్ లో రీ ట్వీట్ చేయటం యొక్క అంతరార్దం ఎవరికీ అర్దం కావటం లేదు. ముఖ్యంగా చిరంజీవి 150 వ చిత్రం నిర్మిస్తున్న సమయంలో ఈ ట్వీట్ చేయటంతో ప్రాధాన్యత హెచ్చింది.

కొద్ది రోజుల క్రితం సైతం...

బండ్ల గణేష్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రచయిత బివిఎస్ రవి, కళ్యాణ్ వర్మల పేర్లు ప్రస్తావిస్తూ వారితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసి ‘స్కిప్ట్ లాక్డ్' అనే ట్వీట్ చేసారు. దీంతో ఇది చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన స్కిప్టే అనే ప్రచారం జరుగుతోంది.

ఇదే విషయమై గణేష్ ను కొందరు అభిమానులు ప్రశ్నించగా... అసలు సమాధానం చెప్పకుండా.....‘అన్నయ్య సపోర్టు, దేవుడి ఆశీస్సులతో కష్టపడి పని చేసి మీ కోసం మరిన్ని మెమరబుల్ సూపర్ హిట్స్ అందిస్తాను' అంటూ రిప్లై ఇచ్చారు. ఇది చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు అనే విషయమై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Producer Bandla Ganesh shares in ANR tweet

చిరంజీవి 150వ సినిమాకు పూరి దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ తన సినిమాల్లోని హీరోలను సిక్స్ ప్యాక్ బాడీతో చూపిస్తాడు. ఈ నేపథ్యంలో చిరంజీవిని కూడా ఆయన సిక్స్ ప్యాక్ బాడీలో చూపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారని అంటున్నారు. మెగాస్టార్ తో జోడీ కట్టబోయేది ప్రఖ్యాత నటి శ్రీదేవి అనే వార్త కూడా గత వారం రోజులుగా ప్రచారంలోకి వచ్చింది.

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 1990 దశకం చివరిలో సుప్రీం హీరో చిరంజీవి, ఆనాటి అందాల నటి శ్రీదేవి జంటగా నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్‌ను రిపీట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడనే విషయంలో తప్ప.....ఇతర ఏ విషయాల్లోనూ సరైన సమాచారం, క్లారిటీ లేదు. మెగా ఫ్యామిలీ హీరోలను ఈ విషయమై ఎప్పుడూ ప్రశ్నించినా....కథ ఓకే కాలేదు, త్వరలోనే అన్ని వెల్లడిస్తామని గత మూడేళ్లుగా విషయాన్ని నెట్టూకొస్తూ వస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ క్లోజ్ సోర్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ చిత్రానికి రామ్ చరణ్ ముఖ్య నిర్మాత కాగా... బండ్ల గణేష్, ఓ టీవీ ఛానల్ ఓనర్ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారనే ప్రచారం సాగుతోంది.

సదరు టీవీ ఛానల్ ఓనర్ ఎవరు? అనేది ఇంకా బయటకు రాలేదు. మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ వార్తల ప్రకారం....రచయిత బివిఎస్ రవి ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

English summary
Producer Bandla Ganesh quotes ANR regarding money by retweeting some of the old tweets shared by AnR when he was alive.
Please Wait while comments are loading...