»   » అతని కెరీర్ నే ఆపాలని చూస్తున్నారు: ఆ చిన్న డైరెక్టర్ మీద అంత పగ ఎందుకు?

అతని కెరీర్ నే ఆపాలని చూస్తున్నారు: ఆ చిన్న డైరెక్టర్ మీద అంత పగ ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం లేదు.కనీసం అంతకు ముందు సినిమా ఇండస్ట్రీ తో పెద్దగా పరిచయమూ లేదు. అతనొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అయినా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇంటర్నెట్ ద్వారా ఫిల్మ్ మేకింగ్ మీద అవగాహన పెంచుకుంటూ. షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ. డైరెక్ట్ గా "పిజ్జా" సినిమాతో కోలీవుడ్ లోకి ఎంటరయ్యాడు కార్తీక్ సుబ్బరాజ్. ఆ ఒక్క సినిమా తోనే కోలీవుడ్ నే కాదు,టాలీవుడ్,బాలీవుడ్ లోనూ తెలిసిపోయాడు.

"పిజ్జా" తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్టయింది, బాలీవుడ్లో సైతం చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత కార్తీక్ తీసిన "జిగర్ తాండా" కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన "ఇరైవి" సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

విమర్శకుల ప్రశంసలూ బాగానే దక్కాయి. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇన్ని జరిగినా ఇప్పుడు కార్తీక్ మాత్రం "ఇరైవి" సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని స్థితిలో పడిపోయాడు. కెరీర్ మీదే దెబ్బపడే దాకా తెచ్చుకున్నాడు. కొంత స్వయంకృతాపరాధమే అనికూడ చెప్పొచ్చు లెండి...

తన రెండో సినిమా "జిగర్ తాండా" నిర్మాత కదిరేశన్ వల్ల కార్తీక్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అప్పట్లో. బడ్జెట్ పెరిగిపోవడం మీద ఇద్దరి మధ్య గొడవలు నడిచాయి. ముందుగా అనుకున్న ప్రకారం తనకు హిందీ రీమేక్ రైట్స్ లో వాటా ఇవ్వకపోవడంపై కార్తీక్ పెద్ద పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

దాంతో తిక్క రేగిన కార్తీక్ "ఇరైవి"లో కదిరేశన్ ను ఉద్దేశించి ఓ క్యారెక్టర్ పెట్టాడు. ఆ పాత్రను చాలా చెడ్డవాడిగా చూపించాడు. అతడి వల్ల ఓ దర్శకుడి జీవితం నాశనం అయినట్లు చిత్రీకరించాడు. తర్వాత ఆ పాత్రను కిరాతకంగా చంపినట్టు కూడా చూపించాడు. దీంతో కార్తీక్ మీద తమిళ నిర్మాతలకు కోపం వచ్చింది.

karthik

కదిరేశన్ కొందరు నిర్మాతల్ని కూడగట్టి కార్తీక్ మీద చర్యల కోసం పట్టుబడుతున్నాడు. దీని మీద నిన్న కొందరు నిర్మాతలు సమావేశం కూడా నిర్వహించారు. అందరూ కలిసి ఇకపై కార్తీక్ తో ఎవరూ సినిమాలు చేయకూడదంటూ నిర్మాతల మండలిలో తీర్మానం ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

రూ.7 కోట్లతో సినిమా తీస్తానని చెప్పి రూ.13 కోట్లకు బడ్జెట్ పెంచేశాడంటూ ఇరైవి నిర్మాతల్లో ఒకరైన ఙ్ఞానవేల్ రాజా కూదా కార్తీక్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. అతడిపై చర్యలు తీసుకోవాలంటున్న నిర్మాతలవైపే చేరిపోయాడు. ఇక కార్తీక్ పరిస్థితి ఏమిటన్నది ముందు ముందు తెలుస్తుంది. దీనిపై కార్తీక్ సుబ్బరాజు మాత్రం ఏ విధంగానూ స్పందించటం లేదు. కదిరేషన్ పెట్టిన భాదలను మాత్రం వదిలేసి కార్తీక్ మీద నిర్మాతలందరూ కత్తిగట్తటం మాత్రం చాలామంది కోలీవుడ్ జనాలకే నచ్చటం లేదట.

English summary
A few producers are up in arms against director Karthik Subbaraj for the allegedly poor portrayal of a film producer character in his latest creation "Iraivi"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu