»   » దిల్ రాజుపై చీటింగ్ కేసు.. అలా లేపేశారు.. మహిళా రచయిత తీవ్ర ఆరోపణలు..

దిల్ రాజుపై చీటింగ్ కేసు.. అలా లేపేశారు.. మహిళా రచయిత తీవ్ర ఆరోపణలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కాపీరైట్ చట్టం కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రచయిత శ్యామలా రాణి మియాపూర్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తన రచనను కాపీ కొట్టి మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమాను తెరకెక్కించారు అనే ఆరోపణలపై పిటిషన్ దాఖలు చేశారు.

  నా కథ ఆధారంగానే

  నా కథ ఆధారంగానే

  రచయిత శ్యామలారాణి మీడియాతో మాట్లాడుతూ.. 2010లో నా మనసు నిన్ను కోరే అనే నవలను రాశాను. ఆ కథ ఆధారంగానే దిల్ రాజు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చిత్రాన్ని నిర్మించారు. నా అనుమతి లేకుండా సినిమా తీయడం చట్టరీత్యా నేరం. అది ఓ రకంగా చీటింగ్ చేసినట్టే అని అన్నారు.

  మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చూసిన తర్వాత..

  మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చూసిన తర్వాత..

  శ్యామల తాను రచించిన కథను పలువురు టాలీవుడ్ డైరెక్టర్ల దృష్టికి తీసుకురాగా వారు ఆ నవలను తెరకెక్కించడానికి నిరాకరించారు. అయితే 2011లో వచ్చిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమా చూసిన తర్వాత తన కథ చౌర్యానికి గురైందనే విషయం అర్థమైంది.

  కచ్చితంగా నా కథను లేపేశారు..

  కచ్చితంగా నా కథను లేపేశారు..

  మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమాలోని కథ, తన నవలకు సరిగ్గా సరిపోతుందని ఆమె భావించింది. సినిమాలోని మాటలు, సీన్లు తన పుస్తకానికి తగినట్టే ఉంది భావించింది. దాంతో శ్యామల తనక న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది అని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

  ఇప్పుడు ఫిర్యాదు ఏమిటీ

  ఇప్పుడు ఫిర్యాదు ఏమిటీ

  అయితే 2013లో ఈ సినిమా టెలివిజన్ వస్తుంటే చూశాను. చాలా సన్నివేశాలు, డైలాగ్స్ నా పుస్తకంలోనివే అన్నట్టు ఉన్నాయి. దాంతో కంగారు పడి న్యాయ నిపుణులను ఆశ్రయించాను అని శ్యామల మీడియాకు వెల్లడించారనే తాజా సమాచారం. ఎప్పుడో 2011లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏమిటనే సందేహాం వ్యక్తం మవుతున్నది.

  మియాపూర్ పోలీసులు ధృవీకరణ

  మియాపూర్ పోలీసులు ధృవీకరణ

  రచయిత శ్యామల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజు, సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మన్, దర్శకుడు దశరథ్, మాటల రచయిత అబ్బూరి రవిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. వీరిపై ఐపీసీ సెక్షన్ 120 బీ (కుట్ర), 420 (చీటింగ్) కింద కేసు నమోదు చేశామని మియాపూర్ పోలీసులు తెలిపారు.

  స్పైడర్, జై లవకుశ పంపిణీ

  స్పైడర్, జై లవకుశ పంపిణీ

  టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఈ ఏడాది శతమానం భవతి, నేను లోకల్, ఫిదా లాంటి బ్లాక్ బస్టర్లను అందించారు. అంతేకాకుండా మహేశ్ బాబు నటించిన స్పైడర్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే రవితేజతో రాజా ది గ్రేట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు.

  English summary
  A case has been registered with the Hyderabad police against Tollywood producer Dil Raju and four others under the Copy Rights Act on Saturday. Writer Shyamala saying that she had published a novel, 'Na Manasu Ninnu Kore', which was allegedly made into a movie, without permission for using her story, which amounted to cheating. The Madhapur police said that the case booked the accused under sections 120 b (conspiracy) and 420 (cheating) of the Indian Penal Code (IPC). Media reported that Madhapur police registered a case against the distributor of the film, Dil Raju, producer, co-producers Sirish and Lakshman, director K Dasarath and dialogue writer Abburi Ravi.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more