twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వంద ఏళ్ల తర్వాత.. దానయ్య RRR రిలీజ్ డేట్ ప్రకటించగానే!

    |

    జక్కన్న రాజమౌళి తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాల్ని వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితంలో ఎవరికీ తెలియని అంశాలని కల్పిత గాధ రూపంలో తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

    ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్‌లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్

    ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని 2020 జులై 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దానయ్య రిలీజ్ డేట్ ప్రకటించగానే అక్కడున్న పాత్రికేయులంతా పెద్ద ఎత్తున చప్పట్లతో తమ హర్షాన్ని తెలియజేశారు. ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ 1920 కాలంలో జరిగిన కథని సరిగ్గా వంద ఏళ్ల తర్వాత 2020లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఏమైనా విశేషం ఉందా అని ప్రశ్నించగా.. ఈ విషయం మీరు చెప్పే వరకు మాక్కూడా తెలియదు అని రాజమౌళి అన్నారు.

    Producer DVV Danayya announces RRR release date

    సరిగ్గా 1920లో జరిగిన కథ కాదు.. 1920, 22 మధ్యలో జరిగిన కథ ఇది. అలాగని చిత్రాన్ని 2022లో విడుదల చేయం.. 2020లోనే విడుదల చేస్తాం అని రాజమౌళి సరదాగా వ్యాఖ్యానించారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఫారెన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Producer DVV Danayya announces RRR release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X