»   » నిర్మాత కెఎస్ రామారావు అరెస్టు, బెయిల్‌‌పై విడుదల,కారణం

నిర్మాత కెఎస్ రామారావు అరెస్టు, బెయిల్‌‌పై విడుదల,కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు ని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి ,బెయిల్ పై విడుదల చేసారు. కారణం ఏమిటంటే...నిర్మాణంలో పోర్టికో కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆయన్ని ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షు డు గా అరెస్ట్ చేసారు. అలాగే కె.ఎస్ రామారావు తో పాటు... ఎఫ్‌ఎన్‌సీసీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిలను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.

ఫిలింనగర్‌ క్లబ్‌లో పోర్టికో కూలి ఇద్దరు కూలీలు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ రెండతస్తుల భవనం రెండునెలల క్రితం ఓ ఆదివారం మధ్యాహ్నం పేకమేడలా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా పశ్చిమబెంగాల్‌, కర్నాటకకు చెందినవారు. వారిలో ఒకరు మాత్రం ఏపీకి చెందినవాడని అధికారులు తెలిపారు.

మృతులను ఆనంద్‌(35), అన్వర్‌ షేక్‌(35)లుగా గుర్తించారు. క్షతగాత్రులు శ్రీను శ్రీనివాస్‌(29), శివ(31), మల్లేషం(25), మండల్‌(20), కోటీశ్వర్‌, వీరప్ప(24), అజీజ్‌(24) బిశ్వాస్‌(24)లు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఘటన జరిగినానంతరం తొలుత బస్తీవాసులు చేరుకుని సహయాన్ని అందించారు. ఆనక జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపటాయి.

శిథిలాలను ప్రొక్రెయినర్‌ సాయంతో తొలగించారు. నిర్మాణంలో ఉన్న భవనాన్ని విస్తరించే క్రమం లో పది పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ భవన నిర్మాణం సుమారు రెండు నెలల నుంచి జరుగుతున్నట్లు స్థానికులు తెలి పారు.

Producer KS Rama Rao faced arrest

కల్చరల్‌ క్లబ్‌ వద్ద నిర్మిస్తున్న భవనానికి అనమతులు లేవని జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆ స్థలం ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉందని వెల్లడించారు.ఈ భవనం కూలిని నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. కాగా, ఈ భవనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ సాంస్కృతిక సంఘం, ఫిలింనగర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ స్వయంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

భవన నిర్మాణంలో నాసిరకం సిమెంట్‌ను వాడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో రెండు వారాల వ్యవధిలో రెండు ఫ్లోర్లను ఇక్కడ వేయడం, ఏట వాలుగా ఉన్న ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం వల్ల కుప్ప కూలినట్లుగా భావి స్తు న్నారు. నాసిరకం పనుల వల్లనే భవ నం కూలిందని అంటు న్నారు. కాంట్రాక్టర్‌ కక్కుర్తికి ఇద్దరు కూలీలు బలయ్యారని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్‌, యాజ మాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, పిల్లర్ల లోపల వేసిన ప్లాస్టిక్‌ పైపుల్లో ఇసుక నింపారు.

ఇదే ప్రమాదానికి కారణమని ఆ ప్రాంత స్థానికులతో పాటు అధికా రులు భావిస్తున్నారు. ప్రమాదస్థలిని జీహెచ్‌ఎంసీ క్లూస్‌ టీం పరిశీలించింది. నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్‌, ఇసుకను సేకరించింది. అన్నింటినీ పరిశీ లించినానంతరం ఈ ఘటనకు ఎవరు బాధ్యులో వారిపై చర్యలు తప్పక తీసుకొగలమని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ సందర్భంలో పేర్కొ న్నారు.

English summary
The tragic incident of collapse of an under construction building at the FNCC Cultural Centre in Jubilee Hills led to the arrest of few individuals. FNCC Executive Council chief KS Rama Rao and Secretary Rajasekhar Reddy were arrested and released on station bail in connection with this case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu