twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishna:కృష్ణ హై రెమ్యునరేషన్ అంతే.. ఆపాత్రతో సంతృప్తి.. నిర్మాత నట్టి కుమార్ కామెంట్స్

    |

    సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇటు సినీ, రాజీయ సెలబ్రిటీలు, అటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన కుటుంబసభ్యులు అయితే తీవ్ర శోకసంద్రలో మునిగిపోయారు. మహేశ్ బాబుతో సహా మిగతా కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు సినీ ప్రముఖులు, రాజకీయా నాయకులు ఒక్కొక్కరిగా తరలివెళ్లారు. నవంబర్ 16 బుధవారం రోజున సాయంత్ర అశేష అభిమానుల మధ్య జరిగిన అంతిమయాత్ర అనంతరం కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించారు. అలాగే ప్రముఖ నిర్మాత నట్టికుమార్ స్పందించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఆసక్తిర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

    సినీ లోకానికి విషాదం..

    సినీ లోకానికి విషాదం..

    సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకానికి తీవ్ర విషాదం మిగిల్చింది. ఆయన లేని లోటు తీర్చలేదని సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మరణం, ఆయనతో ఉన్న తన అనుబంధాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఆసక్తికర విషయాలను నట్టి కుమార్ తెలిపారు.

     18 గంటలు పనిచేసేవారు...

    18 గంటలు పనిచేసేవారు...

    "సూపర్ స్టార్ కృష్ణ రోజుకి 18 గంటలు పనిచేసేవారు. అలా 18 గంటలు పనిచేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ గారే. ఆయన రికార్డులు ఆయన కొల్లగొట్టేవారు. ఇంకొకరి రికార్డులు కొట్టాలని ఆయనకు ఆలోచనే లేదు. ఆయనకు ఆయనే పోటి. ఆయన సినిమాలు, కలెక్షన్లు గురించి చాలా క్యాలుక్యులేటివ్ గా ఉండేవారు. సినిమా చూసి ఆడదు, ఆడుతుందని చెప్పేవారు. ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ వస్తుందో చెప్పేవారు" అని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు.

     ఆల్ ఇన్ వన్ 24 క్రాఫ్ట్స్..

    ఆల్ ఇన్ వన్ 24 క్రాఫ్ట్స్..

    కృష్ణ విషయానికి వస్తే.. ఆల్ ఇన్ వన్.. 24 క్రాఫ్ట్స్‌లో అనుభవం ఉంది.. ఏ సినిమా కలెక్షన్స్ గురించైనా అవలీలగా చెప్పేవారు. ఒక ఎడిటర్, ఒక రచయిత, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబిటర్ ఇలా ఆల్ ఇన్ వన్ 24 క్రాఫ్ట్స్‌పై పట్టున్న హీరో నాకు తెలిసి ఇంకెవ్వరూ లేరు. ఇక ముందు ఉంటారని అనుకొను.. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. కృష్ణంరాజు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బాటలో నటులందరూ నడవాలి.. వాళ్ల క్రమశిక్షణ, వాళ్ల పట్టుదలను చూసి స్పూర్తి పొందాలని నట్టి కుమార్ అన్నారు.

    అవకాశాలు ఇచ్చి ప్రయోగాలు చేసి..

    అవకాశాలు ఇచ్చి ప్రయోగాలు చేసి..

    "నిర్మాత బాగుండాలి, థియేటరే దేవాలయం, నిర్మాత బాగుంటేనే మనం బాగుంటామని కృష్ణ గారు ఆలోచించేవారు. నిర్మాత నష్టపోస్తే పిలిచి, డైరెక్టర్ ని పిలిచి నువ్ ఈ సినిమా చేయి అని, కొత్త డైరెక్టర్ కు, ఎడిటర్ కు ఛాన్స్ ఇచ్చి ప్రయోగాలు చేసి హిట్లు కొట్టింది ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ గారే. నాకు తెలిసి చివరిదాకా కూడా అత్యధిక పారితోషికం తీసుకున్నారు గానీ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. నాకు తెలిసి అత్యధిక రెమ్యునరేషన్ రూ. 20 లక్షలు తీసుకున్నారు. 65 సంవత్సరాల వయసులో సింగిల్ సాంగ్స్ చేశారు. ఆయన రెమ్యునరేషన్ నాకు తెలిసి రూ. 25 లక్షలు దాటలేదు. అయితే అందరూ కలిసి అభిమానం కొద్ది రూ. 50, రూ. 40 లక్షలు ఇచ్చారు గానీ, నాకు తెలిసి ఆయన హీరోగా రూ. 15 లక్షలు పారితోషికం దాటలేదు. కృష్ణ గారు అంతమంచి వ్యక్తి. పారితోషికం తగ్గించి ఇచ్చిన తీసుకునేవారు. ఏమనేవారు కాదు" అని తెలిపారు నిర్మాత నట్టి కుమార్.

    ఆ పాత్ర వేయాలని ఉంది..

    ఆ పాత్ర వేయాలని ఉంది..

    ఏసు మహి సినిమాలో మురళి మోహన్, శాంతి సందేశం చిత్రంలో కృష్ణగారు ఏసు ప్రుభువు పాత్ర వేశారు. కృష్ణగారికి ఎప్పటినుంచో ఏసు ప్రభువు క్యారెక్టర్ వేయాలని ఉందని చెప్పేవారు. ఆ పాత్ర వేస్తున్నాను అంటే అందరం పద్మాలయ స్టూడియోలో కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. నాకు ఎప్పటి నుంచో ఈ పాత్ర వేయాలని ఉందయ్య వేశానని, మహారథి రాయమంటే రాశారాని, ఆయనకు చాలా తృప్తిగా ఉందని అన్నారని నట్టి కుమార్ వెల్లడించారు.

    ఆ పాత్ర వేయాలని ఉంది..

    ఆ పాత్ర వేయాలని ఉంది..

    ఆయనకు ఎప్పటినుంచే ఏసు ప్రభువు క్యారెక్టర్ వేయాలని ఉంది, వేస్తున్నాను అంటే అందరం పద్మాలయ స్టూడియోలో కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. నాకు ఎప్పటి నుంచో ఈ పాత్ర వేయాలని ఉందయ్య వేశాను. మహారథి రాయమంటే రాశావు. నాకు చాలా తృప్తిగా ఉందని అన్నారు. ఇంటి నుంచే భోజనం వచ్చేది. టైమింగ్ కరెక్ట్ మెయింటేన్ చేసేవారు. విజయ నిర్మల గారు పోయాక ఆయన ఒంటరివాడు అయ్యారంటే చెప్పుకోవచ్చు.

    ఏదో తెలియని లోటు..

    ఏదో తెలియని లోటు..

    కృష్ణ గారి ఆహారం, భార్యతో అనుబంధం గురించి చెబుతూ.. "ఆయనకు ఇంటి నుంచే భోజనం వచ్చేది. టైమింగ్ కరెక్ట్ మెయింటేన్ చేసేవారు. విజయ నిర్మల గారు పోయాక ఆయన ఒంటరివాడు అయ్యారనే చెప్పుకోవచ్చు. విజయ నిర్మల గారితో కలిసి పనిచేశారు. ఇద్దరికి చాలా అటాచ్ మెంట్ ఉండేది. ఆమెతో ఇందిరాగారితో అటాచ్ మెంట్ ఉండేది. వాళ్లు చనిపోయారు. కృష్ణగారికి కొడుకు (రమేష్ బాబు) అంటే పంచ ప్రాణాలు. ఆయన మరణించారు. అలాగే కృష్ణగారికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా ఏదో తెలియని లోటు కనిపించిందని అనుకోవచ్చు. ఈ లోటు ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. లేకుంటే ఇంకో నాలుగైదు సంవత్సరాలు జీవించేవారు" అని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు.

    English summary
    Producer Natti Kumar Sensational Comments On Superstar Krishna And Reveals His Highest Remuneration In An Interview
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X