For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna:ఏ సినిమా తీసిన డబ్బే.. అప్పట్లోనే ఆ ట్రెండ్.. కృష్ణ గురించి తెలియని నిజాలు!

  |

  నటుడు, నిర్మాత, దర్శకుడు, సూపర్ స్టార్, నట శేఖర కృష్ణ మరణంతో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆదివారం (నవంబర్ 13) గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన ఆయన నవంబర్ 15న ఉదయం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

  సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తితం, సినిమాపై ఆయన చేసిన ప్రయోగాలను కొనియాడుతూ సినీ, రాజకీయ ప్రముఖులు కొనియాడారు. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

  డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయాలు..

  డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయాలు..

  సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర విషాదం మిగిల్చింది. ఆయన లేని లోటు తీర్చలేదని సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. బుధవారం అశేష అభిమానుల మధ్య జరిగిన అంతిమయాత్ర అనంతరం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.

  తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మరణం, ఆయనతో ఉన్న తన అనుబంధం, ఆయన గొప్పతనం, డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా తీసుకున్న నిర్ణయాలు గురించి తెలిపారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్. ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

  ఏ సినిమా తీసిన డబ్బే..

  ఏ సినిమా తీసిన డబ్బే..

  "1991 నుంచి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నా. అప్పటి నుంచి ఆయనతో ఏ సినిమా తీసిన డబ్బులే డబ్బులు. బుర్రిపాలెం బుల్లోడు, శక్తి, కిరాయి కోటిగాడు ఎక్కడేసిన డబ్బే డబ్బు అది. ఇప్పుడు రీరిలీజ్ పెట్టారు. కానీ ఆరోజుల్లో కృష్ణ గారు రీరిలీజ్ ట్రెండ్ సృష్టించారు. ఎప్పుడు వేసినా డబ్బే.. అలాంటి సినిమాలు ఉన్నాయి. పాడి పంటలు, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు. ఆయన చేసిన ప్రతిదాంట్లో ఓ చరిత్ర ఉంది.

  అనుకున్న తేదికి రిలీజ్ కావాల్సిందే..

  అనుకున్న తేదికి రిలీజ్ కావాల్సిందే..

  సినిమా స్కోప్ కావొచ్చు, ఈస్ట్ మన్ కలర్ కావచ్చు ఇలా చెప్పుకుంటే అన్ని గ్రేట్ నెస్ ఆయనవే. ఆయన గురించి తెలియని విషయం ఏంటంటే.. సినిమా రిలీజ్ డేట్ టు డేట్ కు విడుదల కావాల్సిందే. ఎన్ని ఫైనాన్స్ సమస్యలు ఉండని, ఏమైనా సరే. నిర్మాతకు సమస్యలు ఉన్న ఆయన వచ్చి దగ్గరుండి చూసుకుని అన్ని సంతకాలు పెట్టించి సినిమాను రిలీజ్ చేసిన సంఘటనలు కొకొల్లలు ఉన్నాయి.

  ఆయన ఒక చరిత్ర..

  ఆయన ఒక చరిత్ర..

  జమదాగ్ని సినిమాకు థియేటర్ ఫ్రంట్ డోర్లో ఫైనాన్షియర్స్ ఇబ్బంది పెడుతున్నారని తెలిసి.. ఆయన కారు వెనుకాల నుంచి వేసుకొని వచ్చి ప్లాస్టిక్ కవర్లతో ప్రింట్స్ కవర్ చేసి తీసుకొచ్చి థియేటర్లో పెట్టారు. అలాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆయన. ఇలాంటివి చెప్పుకుంటే డేరింగ్ డ్యాషింగ్ పనులు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక చరిత్ర. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎవరూ నష్టపోకుండా చూసుకునేవారు.

  ఫ్యాన్స్ గురించి ఆలోచించేవారు..

  ఫ్యాన్స్ గురించి ఆలోచించేవారు..

  కృష్ణ గారు అంటే నిర్మాతల మనిషి. డిస్ట్రిబ్యూటర్ల మనిషి. ఆయనంటే సినిమానే. ఆయన సినిమా హిట్టు ప్లాపు అని ఉండదు. ఆయనకు థియేటర్లు ఇవ్వాల్సిందే. ఆరోజుల్లో ఆయనపై అభిమానం అలా ఉండేది. ఆయన నాలుగైదు సినిమాలు చేసేవారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యాన్స్ కు కచ్చితంగా సమయం కేటాయించేవారు. వాళ్లకు ఫొటోలు, ఎలా వచ్చారు, భోజనం అన్ని చూసుకునేవాళ్లు.

  ఎక్కువగా అభిమాన సంఘాలు ఆయనపైనే..

  ఎక్కువగా అభిమాన సంఘాలు ఆయనపైనే..

  ఫస్ట్ టైమ్ రిజిస్టర్ డ్ అసోసియేషన్లు ఆయనతోనే స్టార్ అయింది. ఆయనతో అభిమానా సంఘాలు స్టార్ అయ్యాయి. అభిమానం అంటే ఆయనతోనే మొదలైంది. చాలా వరకు అభిమాన సంఘాలు ఉన్నాయి. కానీ, ఇప్పటికీ కూడా ఈరోజుకి కూడా అభిమాన సంఘాలు ఎక్కువగా ఉండేవి ఆయనవే. సంవత్సరానికి 18 సినిమాలు చేసిన రోజులున్నాయి. 10, 9 సినిమాలు విడుదల చేసిన రోజులున్నాయి. 18 గంటలు పని చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే" అని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.

  English summary
  Producer Natti Kumar Reveals About Superstar Krishna Unknown Facts And Daring Decisions In An Latest Interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X