»   » మళ్ళీ నిరాహార దీక్ష చెయ్యాలేమో...నిర్మాత రవిచంద్

మళ్ళీ నిరాహార దీక్ష చెయ్యాలేమో...నిర్మాత రవిచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవరి లోపం? నా లోపమా? మీ లోపమా? పెద్ద సినిమాలు తీసిన వారు కూడా హ్యాపీగా లేరు. ఈ మధ్య గుంటూరు డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వీటన్నింటినీ చూస్తుంటే పెద్దలతో మాట్లాడి మళ్ళీ నిరాహార దీక్ష చేయడమా? ఇంకేమన్నా చేయాలనా? అనేది త్వరలో ప్రకటిస్తాను" అని నిర్మాత యలమంచి రవిచంద్ అన్నారు. ఆయన పైరసీపై మీడియాతో మాట్లాడుతూ..."మార్చిలో నేను పైరసీ మీద నిరాహార దీక్ష చేసినప్పుడు చాలా మంది స్పందించారు. పీడీ యాక్ట్ తెస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు అన్నారు.

అలాగే అమీర్‌పేట్‌లోనూ, కోటిలోనూ విచ్చలవిడిగా ఈ మధ్య విడుదలైన పెద్ద సినిమాల పైరసీ సీడీలు దొరుకుతున్నాయి. వాటిని చూస్తే కడుపుతరుక్కుపోతోంది. నేను నిరాహారదీక్ష చేసినప్పుడు చాలా మంది పెద్దలు వచ్చారు. అప్పుడు ఎందుకొచ్చారు? ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఛాంబర్‌లో కూర్చునే వాళ్ళు కేవలం సీట్లకు అలంకార ప్రాయంగా మాత్రమే ఉంటున్నారు. అయినా పరిశ్రమ ఎంత పోరాడినా పైరసీ విచ్చలవిడిగా సాగుతూనే ఉందంటే దానికి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందనిపిస్తోంది అని ఆయన అన్నారు.

ఇక నేను నిరాహార దీక్ష చేయడానికి కూర్చున్నప్పుడు కూడా నన్ను అక్కడి నుంచి లేపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో నాకు తెలుసు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడరు. చాంబర్‌లో పనులు, అక్కడి విషయాలకు మాత్రం అందరూ కుక్కల్లా తిరుగుతుంటారు. దీనికో పరిష్కారం చూడాలి అని ఆయన అన్నారు. యలమంచిలి రవిచంద్..ఛార్మి, వేణులతో మాయగాడు చిత్రం గతంలో రూపొందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu