»   » అనుమానాస్పదంగా మృతి చెందిన నిర్మాత కొడుకు..

అనుమానాస్పదంగా మృతి చెందిన నిర్మాత కొడుకు..

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి(45) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలోని పంబలి బీచ్ లో అతడి మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది. గోపాల్ రెడ్డి 80, 90 దశకాలలో విజయవంతమైన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

బీచ్ లో భార్గవ్ మృత దేహం కనిపించడంతో పోలీస్ లు దర్యాప్తు చేస్తన్నారు. ప్రమాదవ శాత్తు అతడు సముద్రంలో పడిపోయాడా లేక వేరే ఇతర కారణాలేమైనా అనే విషయాలు పోలీస్ ల దర్యాప్తులోనే తేలవలసి ఉంది.

Producer S Gopal Reddy son dies in mysterious conditions

పంబలి స్థానికులు ఇస్తున్న సమాచారం ప్రకారం అతడి మృతికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్గవ్ రెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నాడు. పంబలి లో అతడికి హేచరీ వ్యాపారం ఉన్నట్లు తెలుస్తోంది. తన వ్యాపారాన్ని చూసుకునేందుకు సోమవారం భార్గవ్ పంబలికి వచ్చాడు. సిబ్బందిని కలసిన అనంతరం భార్గవ్ పడవలో భార్గవ్ సముద్రంలోకి వెళ్లినట్లు వెళ్ళాడు. కానీ తిరిగిరాలేదని, మంగళవారం ఉదయం అతడి శవం ఒడ్డుకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

భార్గవ్ సముద్రంలో ఎలా పడిపోయాడు అనే విషయంలో క్లారిటీ లేదు. కాగా నిర్మాత గోపాల్ రెడ్డి తన కొడుకు పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి బాలకృష్ణ తో అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ముద్దుల కృష్ణయ్య, మహా నంది, మువ్వా గోపాలుడు, మురళి కృష్ణుడు వంటి విజయవంతమైన చిత్రాలని గోపాల్ రెడ్డి నిర్మించారు.

English summary
Producer S Gopal Reddy son dies in mysterious conditions. S Gopal Reddy is successful producer in 90's.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X