»   » పోరా! నువ్వు ఎవడ్రా అంటారు.... ఇండస్ట్రీలో డ్రగ్స్, సెక్స్ ఇష్యూపై సురేష్ బాబు!

పోరా! నువ్వు ఎవడ్రా అంటారు.... ఇండస్ట్రీలో డ్రగ్స్, సెక్స్ ఇష్యూపై సురేష్ బాబు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్, యూఎస్ఏ సెక్స్ రాకెట్ పై సురేష్ బాబు స్పందన

  ఇండియాలో బాలీవుడ్ తర్వాత అతిపెద్ద సినీ ఇండస్ట్రీగా టాలీవుడ్ పేరు తెచ్చుకుంది. అధిక సంఖ్యలో సినిమాలతో పాటు బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒక వైపు. మరో వైపు ఇండస్ట్రీలో చిన్న సినిమాలను తొక్కేస్తున్నారనే గొడవలు, కాస్టింగ్ కౌచ్ పెద్ద ఇష్యూ కావడం, టాలీవుడ్ డ్రగ్స్ కేసు కలకలం, చికాగో సెక్స్ రాకెట్లో తెలుగు వారికి లింక్స్... ఇలా అనేక సమస్యలు ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు టీవీ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు.

  అలా అనడం ఫూలిష్ టాక్

  అలా అనడం ఫూలిష్ టాక్

  భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి, కానీ ఇప్పటికీ చిన్న సినిమాలను ఆ నలుగురు థియేటర్లు దొరకకుండా తొక్కేస్తున్నారనే ఒక వాదన ఎప్పటి నుండో ఉంది. దీనిపై సురేష్ బాబు స్పందిస్తూ ఇలా అనడం ఫూలిష్ టాక్. మొన్న పది చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిని ఎవరు తొక్కేశారు? అన్నింటికీ కొన్ని థియేటర్లు దొరికాయి. పెద్ద సినిమాలు ఆడటం లేదనటం కూడా ఫూలిష్. రంగస్థలం చాలా బాగా ఆడింది. రామ్ చరణ్ వెరీ కమర్షియల్ యాక్టర్. ఒక న్యూ ఏజ్ కమర్షియల్ సినిమాను వారు క్రియేట్ చేశారు.... అని సురేష్ బాబు తెలిపారు.

  జనం ఇష్టపడే మంచి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి

  జనం ఇష్టపడే మంచి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి

  తొక్కేస్తున్నారని కంప్లయింట్ చేసే వారు కరెక్ట్ సినిమా తీస్తున్నారా? లేదా? అనేది చూడాలి. తొక్కేస్తున్నారు అనే వారు... ఈ రోజు ఎన్ని థియేటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్నాయో చూడాలి. చాలా థియేటర్లు షోలు వేయలేక మూసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 1700 నుండి 1800 థియేటర్లు ఉన్నాయి. మేము కొంచెం అయినా జనం వచ్చే సినిమాలు వేసుకోవాలని చూస్తాం. కానీ అలాంటి సినిమాలు దొరకడం లేదు. అన్ని మంచి సినిమాలు రావడం లేదు.... అని సురేష్ బాబు అన్నారు.

   జనం ఆలోచన డిఫరెంటుగా ఉంటుంది

  జనం ఆలోచన డిఫరెంటుగా ఉంటుంది

  పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీసినప్పటి పరిస్థితి, చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు తీసినప్పుడు ఉండటం లేదు అనేది నిజం కాదు. త్వరలో నేను ‘కేరాఫ్ కంచెరపాలెం' అనే సినిమా రిలీజ్ చేయబోతున్నాను. అది తీసింది చిన్నవాళ్లు. వాళ్ల దగ్గర నుండి నేను సినిమా తీసుకుని ఆరు నెలలు అయింది. ఇంకా దాన్ని రిలీజ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. ఒక మంచి ప్రొడక్ట్ ఉన్నపుడు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. ఆడియన్స్ ఆలోచన చాలా డిఫరెంటుగా ఉంటుంది. ఒకే రోజు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు విడుదలైనపుడు వారి వద్ద ఉన్న వంద రూపాయలు చిన్న సినిమా ఎందుకు పెట్టాలి... ఆ రోజు విడుదలైన ‘సంజు' అనే సినిమా కోసమో, ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' లాంటి వాటికి పెట్టడానికే ఆసక్తి చూపుతాడు.... అని సురేష్ బాబు అన్నారు.

   చెత్త సినిమా ఫ్రీగా వేసినా చూడరు

  చెత్త సినిమా ఫ్రీగా వేసినా చూడరు

  చిన్న సినిమాల గురించి మాట్లాడే వారు వచ్చిన ప్రతి చిన్న సినిమా చూస్తున్నారా? ఇండస్ట్రీలో వందకుపైగా చిన్న సినిమాలు వస్తుంటే అందులో ఐదో పదో సగటు ప్రేక్షకుడు చూస్తున్నాడు. ఐదు పదిలో నా సినిమా వైపు ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేయడం ఎలా? అనేది మేము ఆలోచిస్తాం. ఒక చెత్త సినిమాను ఫ్రీగా వేసినా ఎవరూ చూడరు, వారి సమయం వేస్ట్ చేసుకోవడానికి ఆసక్తి చూపరు. అది బావుందనే ఫీలింగ్ ప్రేక్షకుడికి వచ్చినపుడే డబ్బులు పెట్టి థియేటర్ కు వస్తాడు.... అని సురేష్ బాబు తెలిపారు.

  వాటిని ఆపడం అంత సులభం కాదు

  వాటిని ఆపడం అంత సులభం కాదు

  డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్, యూఎస్ఏ సెక్స్ రాకెట్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉండటం దురదృష్టకరం. అదే సమయంలో వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒక వేళ కంట్రోల్ చేసినా మళ్లీ రావు అనుకోవడం ఫూలిష్ నెస్. సెక్స్, డ్రగ్స్ అనేది హ్యూమన్ రిలేటెడ్ సమస్యలు. దాన్ని ఆపడం అంత సులభం కాదు అని సురేష్ బాబు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అయితే పెద్దలంతా కూర్చుని పరిష్కారం చేయడానికి వీలవుతుంది. కానీ వ్యక్తిగతం అయిన ఇలాంటివి కంట్రోల్ చేయడం చాలా కష్టమని సురేష్ బాబు అన్నారు.

  సినిమా యూనిట్ మొత్తం డ్రగ్స్ తీసుకునే వారైతే పరిస్థితి ఏంటి?

  సినిమా యూనిట్ మొత్తం డ్రగ్స్ తీసుకునే వారైతే పరిస్థితి ఏంటి?

  డ్రగ్స్ తీసుకునే వారు సినిమాలకు పని చేయకూడదు అని రూల్ పెట్టామనే అనుకోండి..... యూనిట్ మొత్తం డ్రగ్స్ తీసుకుని పని చేసే వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. అవి తీసుకుని కథలు రాసేవారు, మ్యూజిక్ చేసే వారు ఉన్నారు, వారు వెరీ టాలెంట్ కూడా అయ్యుండొచ్చు. అలాంటపుడు టాలెంటెడ్ పీపుల్‌ను వదిలేసి లెస్ టాలెంటెడ్ పీపుల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఇక వ్యభిచారం అనేది మనుషులు పుట్టినప్పటి నుండి ఉంది. శతాబ్దాలుగా మహిళలను వేధిస్తున్న మగాళ్లు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్లా ఉన్నారు అని సురేష్ బాబు తెలిపారు.

  పోరా నువ్వు ఎవడ్రా అనే పరిస్థితి ఉంది

  పోరా నువ్వు ఎవడ్రా అనే పరిస్థితి ఉంది

  ఇండస్ట్రీలో సమస్యలు పట్టించుకునే ఇంట్రస్టు చాలా మందికి పోతోంది. దాసరి నారాయణ రావుగారు, మా నాన్నగారు, డివిఎస్ రాజుగారు, ఎంఎస్ రెడ్డి గార మాట అపుడు వినేవారు. అలా ఉండటం వల్లే అపుడు వారు కంట్రోల్ చేయగలిగారు. కానీ ఈ రోజు మేము కంట్రోల్ చేయలేక పోతున్నాం. ఈ రోజు మర్యాదలు కూడా లేవు. మేము వెళ్లి అడిగితే... పోరా నువ్వు ఎవడ్రా అనే పరిస్థితి ఉంది. ఇలాంటివి మనకు ఎందుకులే అని చాలా మంది తప్పించుకుంటున్నారు.... అని సురేష్ బాబు అభిప్రాయ పడ్డారు.

  English summary
  Producer Suresh Babu Sensational Comments on Drugs Addicts in Tollywood. He said that we should not mix drugs issue with the film industry because it is a personal issue. He said that "We can bring a rule to stop drug addicts from doing films. What if an entire film unit takes drugs? There are such groups. There are some celebrities who can't work without taking drugs.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more