»   »  తమన్నాని మోసం చేసిన నిర్మాత!

తమన్నాని మోసం చేసిన నిర్మాత!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tamanna
రెండు రోజుల క్రిందట అల్లరినరేష్ ,తమన్నా కాంబినేషన్ లో పద్మశ్రీ ఏడుకొండలు అనే సినిమా ప్రాంరంభిస్తున్నట్లు నిర్మాత ఎమ్.సత్యనారాయణ మీడియాకు న్యూస్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాకు తనకీ ఏ సంభంధం లేదంటోది తమన్నా. ఆమెకు అసలా సినిమా గానీ, నిర్మాత గానీ తెలీనే తెలియదని చెప్తోంది. ఆమె తండ్రి డేట్స్ చూస్తూంటాడనీ ఆయనే ఈ న్యూస్ చదివి,వచ్చే ఫోన్ కాల్స్ వింటూ షాక్ అయ్యారని వివరించింది.

ఇదంతా ఎలా జరిగిందో,ఇందుకిలా ప్రవర్తించారో తెలియటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమని సంప్రదించకుండానే ఎలా ఆ దర్శక,నిర్మాతలు తన పేరును ప్రకటించారో అర్ధం కావంటం లేదని,అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఏక్ట్ చేయటాన్ని కూడా ఖండించింది. అఫీషియల్ గా నా చేతిలో ఒక్క సిద్దార్ధ చిత్రం మాత్రమే ఉందంటూ వివరించింది. ఇక ఆమె తండ్రి సంతోష్ భాటియా కూడా తాము మొదట ఇది నమ్మలేదని,తర్వాత పేపర్లో న్యూస్ చూసి ఆశ్చర్యపోయామనీ,మరీ ఇంతలా ఫ్రొపిషనల్ ఎథిక్స్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తారంటూ చెప్పుకొచ్చారు. చాలా...చాలా బ్యాడ్ కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X