»   »  లారెన్స్ కు షాక్... రెండున్నర కోట్లు ఫైన్

లారెన్స్ కు షాక్... రెండున్నర కోట్లు ఫైన్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ప్రభాస్ 'రెబల్‌' సినిమాకి సంబంధించిన వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రూ.2.5 కోట్లు నిర్మాతలకు చెల్లించాలని దర్శకుడు లారెన్స్‌కి నిర్మాతల మండలి స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ సినిమాను రూ.22.5 కోట్లు వ్యయంతో రూపొందిస్తానని నిర్మాతలు భగవాన్‌, పుల్లారావులతో దర్శకుడు ఒప్పందం చేసుకొన్నారు. నిర్మాణ వ్యయం పెరిగింది.

  ఫలితంగా నిర్మాతలకు రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందనీ ఆ మొత్తాన్ని లారెన్స్‌ నుంచి ఇప్పించాలని నిర్మాతల మండలిని ఆశ్రయించారు. భగవాన్‌, పుల్లారావు. దీనిపై మండలి... దర్శకుల సంఘంతో కలిసి సమన్వయ కమిటినీ ఏర్పాటు చేసి చర్చలు సాగించింది. లారెన్స్‌ రెండున్నర కోట్ల రూపాయలు నిర్మాతలకు ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది.

  ప్రభాస్‌ హీరోగా నటించిన 'రెబల్‌' చిత్ర నిర్మాణ వ్యయం అదుపు తప్పడానికి కారణం దర్శకుడు లారెన్స్‌ అని ఆ చిత్ర నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ ని మీడియా కలిసింది. ఆయన మాట్లాడుతూ ''మా ముందుకి నిర్మాతల ఫిర్యాదు వచ్చింది. ఖర్చు పెంచడం వల్లే నష్టం వాటిల్లిందని వారు స్పష్టం చేశారు. హిందీ హక్కుల్ని తన ప్రమేయం లేకుండా ఇచ్చేశారని దర్శకుడు అంటున్నారు. దీనిపైన నిర్మాతలూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలి, దర్శకుల సంఘం సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి చర్చలు సాగిస్తున్నాము'' అన్నారు.

  నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి చేసిన ఫిర్యాదులో రూ.22.5 కోట్ల వ్యయంతో రూపొందిస్తానని దర్శకుడు లారెన్స్ ఒప్పంద పత్రం రాశారనీ, అయితే చిత్ర నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.40 కోట్లు ఖర్చయిందనీ వారు తెలిపారు. మరో వైపు లారెన్స్‌ 'రెబల్‌' నిర్మాతలపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా ఆ చిత్రానికి సంబంధించిన రీమేక్‌, అనువాద హక్కుల్ని నిర్మాతలు అమ్మినట్లు తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి రెండుమూడు రోజుల్లో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని తెలిసింది.

  లారెన్స్ దర్శకత్వంలో విడుదలైన రెబెల్ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అప్పటికీ సినిమా లెంగ్త్ ఎక్కువైందని ట్రిమ్ చేసి వదిలినా ఫలితం లేకుండా పోయింది. మాస్ పేరుతో తన అరవ పైత్యాన్ని లారెన్స్ చూపించాడంటూ అంతటా విమర్శలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈ సినిమా నిమిత్తం బాగా నష్టపోయినట్లు సమాచారం. వారు తమ డబ్బు రిఫెండ్ చేయాలని నిర్మాతపై వత్తిడి తెస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ నేపధ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

  ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  Producer's Council has taken a daring decision and in an unprecedented move ordered the director Raghavendra Lawrence to pay Rs 2.5 Crores to producers J Bhagavan and Pullarao. Lawrence directed Rebel starring Prabhas and Tamannah in the lead roles for the producers but he crossed the budget limit by about Rs 15 Crores. So they approached the Producer's Council and demanded a refund from the director. They filed the complaint much before the release of the movie in September this year.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more