twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలు ఆపేస్తామంటూ కార్మికులను హెచ్చరిస్తున్న నిర్మాతలు

    By Pratap
    |

    వేతనాల పెంపు విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించకపోతే సినిమా నిర్మాణాలు ఆపేస్తామని తెలుగు సినీ నిర్మాతలు కార్మికులను హెచ్చరిస్తున్నారు. కార్మికులు షూటింగులకు రాకపోతే స్వచ్ఛందంగా సినిమా నిర్మాణాలను ఆపేస్తామని వారంటున్నారు. నిర్మాతల మండలికి, ఎపి చలనచిత్ర కార్మిక సంఘాల సమాఖ్యకు మధ్య జరిగిన చర్చలు శుక్రవారం విఫలమయ్యాయి. తాము పెంచిన వేతనాలకు 16 కార్మిక సంఘాలు అంగీకరిస్తుండగా, ఐదు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని నిర్మాతల మండలి ప్రతినిధులు చెప్పారు. ముంబై, చెన్నై, బెంగళూర్‌ల్లో ఇచ్చే వేతనాల కన్నా తాము ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని వారంటున్నారు.

    కార్మికుల వేతనాల్లో ఇప్పుడున్న దానికంటే 32 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతోపాటు ఒప్పందపత్రాలను త్వరలోనే వారికి అందజేస్తామని నిర్మాతల మండలి సభ్యుడు దగ్గుబాటి సురేష్‌ ఈరోజు మీడియాతో చెప్పారు. జూనియర్‌ ఆర్టిస్టులకు దినసరి వేతనం రూ. 450 ఇవ్వటానికి సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. 60 శాతం వరకు పెంచాలని వారు కోరుతున్నారని అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అన్నారు. కార్మికచట్టం కంటే ఎక్కువగానే తాము పెంచుతామన్నామని అన్నారు. కార్మికులు అంగీకరించకపోతే ఇతర రాష్ట్రాల కార్మికులతో పనిచేయించుకునేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు.

    English summary
    Talks between Telugu producers council and AP film federation failed. Producers accepted to hike 32 percent in present wages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X