»   » రామానాయుడు ఆస్తులు: సురేష్ బాబు-వెంకటేష్ మధ్య పరిస్థితి ఎలా ఉంది?

రామానాయుడు ఆస్తులు: సురేష్ బాబు-వెంకటేష్ మధ్య పరిస్థితి ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత రామానాయుడు ఆ మధ్య కాలం చేసిన కొన్ని రోజుల తర్వాత రకరకాల పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. రామానాయుడి మరణం తర్వాత వెంకటేష్, సురేష్ బాబు ఆస్తుల పంపకాల గురించి ఆలోచన చేసారని, ఎవరి వాటా ఎంత అనే విషయాలు లెక్కలు వేస్తున్నారని, త్వరలోనే ఇద్దరూ తండ్రి సంపాదించిన ఆస్తులు పంచుకునే అవకాశం ఉందని పుకార్లు వినిపించాయి.

ఆస్తుల పంపకాల తర్వాత వెంకటేష్ సొంతగా మరో ప్రొడక్షన్ మొదలు పెట్టే ఆలోచన ఉందనే వార్తలు సైతం వినిపించాయి. చాలా కాలంగా ఇద్దరి మధ్య ప్రాపర్టీ విషయంలో కోల్డ్ వార్ నడుస్తోందనే రూమర్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి.

ఎక్కడో పల్లెటూరులో రామానాయుడి ప్రస్తానం మొదలైంది. ఆయన పుట్టింది సంపన్న రైతు కుటుంబంలోనే. తనదైన ఆలోచనలతో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ఆయన ఎంతో కష్టపడి దేశంలోనే ప్రముఖ సినీ నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారం దాదా పాల్కే అవార్డు అందుకున్నారు.

సినిమా వ్యాపారాన్ని తెలుగులో రామానాయుడు విస్తరించినంతగా మరెవరూ విస్తరించలేదంటే అతిశయోక్తి కాదేమో. దేశంలోని అన్ని భాష్లో సినిమాలు తీసి రికార్డు క్రియేట్ చేసారు. నిర్మాతగా అత్యధిక సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు.

తన ఇద్దరు కుమారుల్లో ఒకరిని నిర్మాతగా, మరొకరిని హీరోగా నిలబెట్టారు. సినిమా రంగంలో గొప్ప వ్యక్తిగా, ఆదర్శవంతుడిగా, మంచి మనసున్న వ్యక్తిగా పేరుతెచ్చకున్నారు రామానాయుడు. సురేష్ బాబు, వెంకటేష్ ఈ స్థాయికి వచ్చారంటే రామానాయుడు నుండి అందిన క్రమ శిక్షణ, పట్టుదలే కారణమని చెప్పక తప్పదు.

తండ్రి ఉన్నంత కాలం అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారు తండ్రి మరణం తర్వాత ఆస్తులు పంచుకుంటున్నారనే విషయం విని అంతా షాకయ్యారు. అయితే అలాంటి దేమీ లేదని తేలిపోయింది. తమకు ఉన్నఆస్తుల విషయమై ఇటీవల ఇంటర్వ్యూలో నిర్మాత సురేష్ బాబు స్పందించారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన విషయాలు..

ఆస్తులు పంచలేదు

ఆస్తులు పంచలేదు

తండ్రి తమకు ఇచ్చిన ఆస్తుల్ని ఇంకా సమష్టిగానే చూసుకుంటున్నామని, పంపకాలు జరుగలేదని, అలాంటి ఆలోచన మేమెప్పుడూ చేయలదని నిర్మాత సురేష్ బాబు తెలిపారు.

కలిసికట్టుగానే..

కలిసికట్టుగానే..

నేనూ వెంకటేష్ ఎప్పడూ కలిసి కట్టుగానే ఉంటాం. చిన్నప్పటి నుంచీ మా మధ్య ఒకరకమైన అవగాహన కుదిరింది. అన్నయ్య కాబట్టి... నేను పెద్ద - వాడు చిన్న అనే భావన మా మధ్య ఎప్పుడూ ఉండదు అన్నారు సురేష్ బాబు.

పేరు పెట్టే పిలుచుకుంటాం

పేరు పెట్టే పిలుచుకుంటాం

మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం. ఒకరి మాటకు ఒకరం విలువ ఇచ్చుకుంటాం. ఇప్పటికీ పేర్లు పెట్టే పిలుచుకుంటాం. ఒకరి అవసరాలు ఒకరు అర్థం చేసుకుంటామని సురేస్ బాబు తెలిపారు.

అలా జరుగదు

అలా జరుగదు

వాడికి నచ్చని పని నేను చేయడం, నాకు నచ్చనిది వాడూ చేయడం లాంటి ఎప్పుడూ జరుగలేదు జరుగదు కూడా.. అని సురేష్ బాబు తెలిపారు.

ఆస్తులు వాటావేస్తామన్నారు..

ఆస్తులు వాటావేస్తామన్నారు..

నా పెళ్లయిన కొత్తలోనే ఆస్తుల్ని వాటాలు వేసేస్తామని నాన్నగారు అన్నారు. కానీ మేమిద్దరం వద్దన్నాం. కలిసే ఉంటామని చెప్పాం. అలానే ఉంటున్నామని సురేష్ బాబు తెలిపారు.

సొంత, ఉమ్మడి..

సొంత, ఉమ్మడి..

వాడికో సొంత ఇల్లు ఉంది. నాకూ ఓ సొంత ఇల్లు ఉంది. ఇక మిగతాదంతా మా ఇద్దరి ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయని సురేష్ బాబు తెలిపారు.

కష్టపడింది చాలు విశ్రాంతి తీసుకో అంటాడు..

కష్టపడింది చాలు విశ్రాంతి తీసుకో అంటాడు..

వెంకటేష్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇన్నాళ్లూ కష్టపడింది చాలు ఇకనైనా విశ్రాంతి తీసుకుందాం పని తగ్గించుకో అని సలహా ఇస్తుంటాడని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

రానా గురించి..

రానా గురించి..

రానా కెరీర్ గురించి తానెప్పుడూ ఆలోచించలేదు. సొంతంగా కష్టపడి తనకు తానే గుర్తింపు సాధించుకున్నాడు అని సురేష్ బాబు తెలిపారు.

English summary
Movie Moghal Daggubati Ramanaidu Property issue. No War between Venkatesh and Suresh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu