»   » సిగ్గుచేటు.. దారుణం.. అనాగరికం,, సంజయ్‌ దాడిపై హోరెత్తిన నిరసనలు

సిగ్గుచేటు.. దారుణం.. అనాగరికం,, సంజయ్‌ దాడిపై హోరెత్తిన నిరసనలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పద్మావతి చిత్ర షూటింగ్‌లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై నిరసనకారులు అనాగరికంగా దాడి చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ లోని జైగఢ్ కోటలో శుక్రవారం చోటుచేసుకొన్నది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కెమెరాలను ధ్వంసం చేశారు. షూటింగ్ పరికరాలను పగులగొట్టారు. ఈ అనాగరిక చర్యను బాలీవుడ్ ముక్తకంఠంతో ఖండించారు.

కరణ్ జోహర్..

సంజయ్ లీలా భన్సాలీపై దాడి చేయడం దారుణం. చరిత్రకారులు, మోరల్ పోలీసింగ్ ముసుగులో కొందరు జరిపిన దాడి ఆక్షేపణీయం. దర్శకుడి భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారు.

పూజా హెగ్జే..

హింస దేనికి సమాధానం కాదు. హింస ద్వారా ప్రజలు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకొంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు.

కబీర్ ఖాన్

మొదట పద్మావతి చిత్రాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీపై దాడి చేయడం ద్వారా చిత్రాన్ని అడ్డుకోవాలనుకొంటున్నారు. ఆందోళనకారుల చర్య సిగ్గుచేటు

నిఖిల్ అద్వానీ ..

పద్మావతి చిత్ర షూటింగ్ లో నిరసనకారులు దాడి జరిపిన సంజయ్ లీలా భన్సాలీకి మద్దతు నిలుద్దాం.

అర్జున్ రాంపాల్

పద్మావతి షూటింగ్ సిబ్బందిపై దాడి జరిగినట్టు వార్త అందింది. ఈ దాడి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. సంజయ్ భన్సాలీకి పూర్తి మద్దతిస్తాను.

సోహా ఆలీఖాన్..

సంజయ్ లీలా భన్సాలీపై దాడి జరుగడం దారుణం. అహింసా పద్ధతుల్లో నిరసన తెలుపడానికి అనేక మార్గాలున్నాయి. ముమ్మాటికి ఇది క్రిమినల్ చర్య.

బోమన్ ఇరానీ..

సంజయ్ లీలా భన్సాలీపై దాడి అనాగరిక చర్య. ఈ ఘటన విషాదకరం.

శ్రేయ ఘోషల్

రాజస్థాన్ పోలీసులు ఎక్కడ. సిగ్గుచేటు. ఇక ఇలాంటి ప్రజాస్వామ్యంలో బతుకాల్సిన అవసరం ఉందా?. ఇలాంటి ఘటనలు దేనిక సంకేతం.

English summary
A defenceless Sanjay Leela Bhansali slapped and assaulted by a mob on the sets of Padmavati in Jaipur of Rajasthan. Entire Bollywood have come out in Bhansali's support.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu