»   » మెగాలవ్: చెర్రీ పోస్ట్ కి, ఉపాసన సూపర్ ఆన్సర్, మురిసిపోతున్న అభిమానులు

మెగాలవ్: చెర్రీ పోస్ట్ కి, ఉపాసన సూపర్ ఆన్సర్, మురిసిపోతున్న అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్‌చరణ్‌ తేజ్‌ను అభిమానులు 'చెర్రీ' అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఉపాసన మాత్రం రామ్‌చరణ్‌ గురించి సోషల్‌ మీడియాలో రాసేటపుడు 'మిస్టర్‌ సి' అని రాస్తారు. అలాగే చెర్రీ తన భార్యను 'ఉప్సీ' అని ముద్దుగా పిలుస్తుంటాడు. ఉపాసనకు ఫెమినా ఉమెన్స్ అవార్డు రావడంతో 'ప్రౌడ్ ఆఫ్ యూ ఉప్సీ' అంటూ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు రామ్ చరణ్.

మిస్టర్ సీ..!

మిస్టర్ సీ..!

'మిస్టర్ సీ' అంటూ.. తన భర్త చెర్రీ గురించి ఉపాసన చేసే ట్వీట్స్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. అలాగే తన భార్య గురించి చెప్పేందుకో.. ఆమెను ప్రశంసించేందుకో.. చెర్రీ చేసే పోస్టులు కూడా ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా ఉపాసనకు ఓ అవార్డు వచ్చింది.

ఫెమినా ఉమన్స్ అవార్డ్స్ 2017

ఫెమినా ఉమన్స్ అవార్డ్స్ 2017

హెల్త్ కేర్ రంగంలో ఆమె చేస్తున్న సేవలకు గాను.. ఫెమినా ఉమన్స్ అవార్డ్స్ 2017లో ఈమెకు ప్రత్యేకంగా అవార్డ్ ఇచ్చారు. ఉపాసన ఈ విషయాన్ని అందరితోను పంచుకోగా.. ఉపాసన-అవార్డు ఫోటోలను కలిపి పోస్ట్ చేసిన రామ్ చరణ్.. 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఉప్సీ' అంటూ తన అభినందనలు చెప్పాడు.

థ్యాంక్యూ మై లవ్

థ్యాంక్యూ మై లవ్

ఈ ట్వీట్ కే అభిమానులు మురిసి పోతూంటే దానికి ఉపాసన ఇచ్చిన ఆన్సర్ మరింత క్యూట్ గా కనిపించింది 'థ్యాంక్యూ మై లవ్. నువ్వు.. నీ సపోర్ట్ లేకుండా నేను ఇదంతా సాధించగలిగే దాన్నికాదు' అంటూ ఉపాసన రిప్లై ఇచ్చింది. భార్యా భర్తలు ఇద్దరూ ప్రేమాభిమానాలు కలిగి ఉండడమే కాదు.. దాన్ని ఇంత పబ్లిక్ గా ప్రదర్శించడం కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి.

భార్యమీద ప్రేమని పచ్చబొట్టు గా

భార్యమీద ప్రేమని పచ్చబొట్టు గా

అయితే ఈ పిలుపు కేవలం ట్విట్టర్ కో, వాళ్ళిద్దరి మధ్యనో మాత్రం ఆగిపోలేదు. చెర్రీ తన భార్యమీద ప్రేమని గా వేయించుకున్నాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో ఆ మధ్య ఓ కార్యక్రమం జరిగినప్పుడు. అభిమానుల సమక్షంలో జరిగిన ఆ కార్యక్రమంలో రాంచరణ్ పాల్గొన్నాడు.

UPSI అనే అక్షరాలున్న టాటూ

UPSI అనే అక్షరాలున్న టాటూ

అప్పుడు చరణ్ చేతి మీద ఉన్న టాటూ (అయితే ఇది టాటూ కాదు. గోరింటాకుతో రాసింది) అందరి దృష్టినీ ఆకర్షించింది. UPSI అనే అక్షరాలున్న టాటూ అది. ఇలా భార్య పేరుని టాటూ వేయించుకున్నాడంటే తనంటే చరణ్ కి ఎంత ప్రేమ ఉండి ఊహించుకోవచ్చు.

చరణ్ కి బిడియం ఎక్కువ

చరణ్ కి బిడియం ఎక్కువ

నిజానికి మొదట్లో ఈ ఇద్దరూ ఎక్కువగా బయటకనిపించలేదు. పబ్లిక్ లో రామ్ చరణ్ కి బిడియం ఎక్కువ కావటం కూడా ఒక కారణం, కానీ ఈమధ్య ప్రతీ షూట్ లోనూ అభిమానులతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. ఉపాసన మీద ప్రేమ ని కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు.

English summary
Ram Charan wrote, 'Proud of you upsi' while sharing the same post. In reply, Upasana posted: 'Thank you my love. I couldn't have done it without your support'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu