»   » స్పూఫ్ కి అడ్డా ఈ బిడ్డ

స్పూఫ్ కి అడ్డా ఈ బిడ్డ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హిట్ సినిమాలు స్పుూఫ్ చేయటం కామన్. అయితే ఈ మధ్యకాలంలో స్ఫూఫ్ లు పెద్దగా కనపడటం లేదు. కానీ హఠాత్తుగా ఈ నెలలోనే మూడు సినిమాల్లో స్ఫూఫ్ లు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ స్ఫూఫ్ లకు ఎంపిక చేసుకుంది మరే చిత్రాలో కాదు..శ్రీమంతుడు, బాహుబలి, గబ్బర్ సింగ్.

ప్రభాస్ బహుబలి సినిమాను దాదాపు నాలుగు సినిమాలలో స్ఫూఫ్ గా చేయగా ...శ్రీమంతుడు కూడా అదే స్థాయిలో స్పూఫ్ లకు ఎగబాకింది. కాకపోతే ఇందులో విశేషం ఎమిటంటే, ఈ సినిమాల స్పుఫ్ లలో ఎక్కువగా నటించి మెప్పించింది మాత్రం ధర్టి ఇయిర్స్ ఇండస్ట్రీ పృద్వియే కావటం విశేషం.

Prudhvi busy in super hit movies spoof

బాహుబలి లో శివలింగాన్ని ఎత్తిన సీన్ ను అనుకరించడంలో తనకు సాటి ఎవరు లేగని నిరుపించిన ఫృధ్వి.... భలే మంచి రోజు సినిమాలో కూడా పోలీస్ సినిమాల్లో డైలాగులు వరస పెట్టి చెప్పాడు. అంతేకాదు... మహేష్ శ్రీమంతుడు సునిమాలో డైలాగ్స్ అచ్చంగా దించి ఆడియన్స్ చేత ఈలలు వేయించాడు దియోటర్స్ లో. శంకరాభరణం సినిమాలో కూడా శ్రీమంతుడు డైలాగు చెప్పి విజిల్స్ వేయించాడు.

సౌఖ్యం సినిమాలో అయితే పూర్తిగా స్ఫూఫ్ ల మీదే నడిపే ప్రయత్నం చేసారు. ఇదే రీతిలో సప్తగిరి, షకలక శంకర్ కూడా వారి స్థాయిలో స్ఫూఫ్ లు చేసి వారు మెప్పించారు.

English summary
30 years industry Prudhvi has today grown in importance as most in-demand comedian in Tollywood. Prudhvi's 'Bahubali' spoof in 'Soukhyam' is just hilarious.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu