For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏదో జరగబోతోంది, ఊహకి అందనంత అద్బుతంగా ఉంది: పిఎస్వీ గరుడవేగ 126. 8ఎం ట్రైలర్ (వీడియో)

  |
  Balakrishna making Fun With Rajashekar @Garuda Vega Trailer Launch

  సీనియర్ నటుడు రాజశేఖర్ తెరపై కనిపించి చాలా కాలమైంది.. 2015లో రీమేక్ సినిమా 'గడ్డం గ్యాంగ్' తో వెండితెరపై సందడి చేసిన రాజశేఖర్.. ఆ తరువాత గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం 'పిఎస్వీ గరుడవేగ 126. 8ఎం' . ఈ చిత్రం ట్రైలర్ అక్టోబర్ 17న రాత్రి 8 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఆర్కే సినీ ప్లెక్స్‌లో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయడం విశేషం.

   పిఎస్వీ గరుడవేగ 126. 8ఎం

  పిఎస్వీ గరుడవేగ 126. 8ఎం

  ఎల్బిడబ్ల్యూ , రొటీన్ లవ్ స్టోరీ , గుంటూరు టాకీస్ చిత్రాలతో అలరించిన ప్రవీణ్ సత్తారు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ‘పిఎస్వీ గరుడవేగ 126. 8ఎం' తెరకెక్కిస్తున్నారు. ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ నటిస్తుండగా.. తమిళ నటి పూజా కుమార్ అతడి భార్య పాత్రలో నటిస్తుంది.

  సన్నీ లియోన్ ఒక ప్రత్యేక గీతం

  సన్నీ లియోన్ ఒక ప్రత్యేక గీతం

  శ్రద్ధ దాస్ రిపోర్టర్ పాత్ర పోషిస్తుంది. అలీ , కిశోర్ , నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శివాని శివాత్మిక మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి చరణ్, భీమ్స్ సంగీతాన్ని అందించారు.

  యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్‌తో

  యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్‌తో

  సుమారు 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో హాలీవుడ్ నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌‌ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో పాటు ఫోటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది.రష్య‌న్ స్టంట్ మాన్ డేవిడ్ ఖుబు, థాయిలాండ్ స్టంట్ మాన్ నుంగ్, ఇండియన్ స్టంట్ మాస్టర్ సతీష్ నేతృత్వం లో.. జార్జియా, బ్యాంకాక్, మలేషియా, పట్టాయ, సింగపూర్, ముంబై వంటి ప్రదేశాల్లో యాక్ష‌న్ సీన్స్‌, చేజ్ సీక్వెన్స్‌లు మూవీపై హైప్ క్రియేట్ అయ్యేట్లు ఉన్నాయి.

   ఆ మొత్తం కూడా తక్కువే

  ఆ మొత్తం కూడా తక్కువే

  అయితే 5 కోట్ల మార్కెట్ ఉన్న రాజశేఖర్ సినిమాకు 25 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు అంటూ ఒక టాక్ వచ్చినా ట్రలర్ లో ఉన్న విజువల్స్ చూస్తూంటే అసలు ఆ మొత్తం కూడా తక్కువే అనిపించేలాఉనాయి నిజానికి సీనియర్ నటుడైన రాజశేఖర్ కి ఇప్పుడున్న అంచనాల ప్రకారం అంత పెద్ద మార్కెట్ లేదు. అయినా సరే ప్రవీణ్ సత్తారు మాత్రం వెనక్కి తగ్గలేదంటే ఖచ్చితంగా కథలో, తన వర్క్ లో దమ్ముందని నమ్ముతున్నాడన్నమాటే. ఏమో ఈ సినిమా రాజశేఖర్ కీ , ప్రవీణ్ కీ ఒక కీలకమైన మలుపు అవ్వచ్చు కూడా.

   ఏదో జరగబోతోంది

  ఏదో జరగబోతోంది

  హాలీవుడ్‌ స్థాయిలో ‘గరుడవేగ'ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ‘వాళ్ల కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ చాలా హైటెక్‌గా ఉంది. వాళ్లు వెపన్స్‌ లేటెస్ట్‌ టెక్నాలజీవి వాడుతున్నారు. ఏదో జరగబోతోంది. వి నీడ్‌టు క్రాకిట్‌ యాజ్‌ సూన్‌ యాజ్‌ పాసిబుల్‌ సర్‌!' అంటూ రాజశేఖర్‌ పలుకుతున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

  నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్‌ ఇతివృత్తంగా?

  అండర్‌ కవర్‌ ఆఫీసర్‌గా రాజశేఖర్‌ చేపట్టిన మిషన్‌ ఏంటి? నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్‌ ఇతివృత్తంగా సాగనుందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యాక్షన్‌ సన్నివేశాలకు, విజువల్‌ ఎఫెక్ట్స్‌కు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  English summary
  Angry Star Rajasekhar’s new action flick PSV Garuda Vega trailer is just out. Like what director Praveen Sattaru promised with technically high standard visuals in teaser, he continued the same intensity and doubled the visual impact in trailer too.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X