For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమాలో చేయబోతున్నా, వాళ్ళలాగే నన్నూ ఆదరించండి: రాజశేఖర్ కూతురు శివాని

  |
  హీరోయిన్ గా వస్తున్న టాప్ హీరో కూతురు

  ప్రముఖ నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ అవతారం ఎత్తనున్నారు. తమిళ చిత్ర రంగానికి శివాని పరిచయం కానున్నారు. రాజశేఖర్‌, జీవిత దంపతులు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.కొంతకాలంగా కాస్త వెనుకబడ్దట్టే కనిపించిన రాజశేఖర్ గరుడ వేగ హిట్ తో ఇప్పుడు ఆనందం లో ఉన్నాడు.. ఇదే సమయం లో తన సినీరంగ ప్రవేశం పై మళ్ళీ ఒకసారి మట్లాడింది రాజశేఖర్ కుమార్తె శివాని .

   శివానీతో చిత్ర నిర్మాతల చర్చలు

  శివానీతో చిత్ర నిర్మాతల చర్చలు

  కొన్ని నెలలకిందటే తమిళంలో రూపొందే "కుమ్కి 2" చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయనుందన్న వార్తలు వచ్చాయి. శివానీతో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. దాదాపు అగ్రిమెంట్‌పై సంతకం చేసే పని కూడా పూర్తి కావొచ్చిందనీ. స్క్రీన్ టెస్ట్‌గా కూడా చేసినట్టు చెప్పారు కానీ తర్వాత మాత్రం ఈ వార్తలు వార్తలుగానే ఉండి పోయాయి.

   శివాని ని కూడా హీరోయిన్ గా లాంచ్ చెయ్యాలని

  శివాని ని కూడా హీరోయిన్ గా లాంచ్ చెయ్యాలని

  ఇప్పుడు గరుడవేగ హిట్ తో ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ ఈ సమయం లోనే శివాని ని కూడా హీరోయిన్ గా లాంచ్ చెయ్యాలని అనుకుంటున్నాడట.. విజయోత్సవసభలోనే ఈ సినిమా హిట్ పై ఉద్వేగంగా "ఏ మూహుర్తాన ప్ర‌వీణ్ స‌త్తారు ఈ క‌థ చెప్పాడో గానీ...సినిమా స‌క్సెస్ క‌థే కార‌ణ‌మైంది. నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్ర‌మిది.

   సినిమా కోసం నా జీవిత ఎంతో క‌ష్ట‌ప‌డింది

  సినిమా కోసం నా జీవిత ఎంతో క‌ష్ట‌ప‌డింది

  ఇప్ప‌టివ‌ర‌కూ నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్రం `అకుశం` అని చెప్పాను. కానీ గ‌రుడ‌వేగ అంత‌క‌న్నా భారీ విజయాన్ని న‌మోదు చేసింది. సినిమా కోసం నా జీవిత ఎంతో క‌ష్ట‌ప‌డింది. రాజ‌శేఖ‌ర్ స‌రైన స‌క్సెస్ లేద‌ని లోలోప‌ల ఎంతో కుమిలిపోయింది. ఎలాగైనా స‌క్సెస్ ఇవ్వాల‌ని సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డింది. అలాగే ప్ర‌వీణ్ సినిమా కోసం ప‌డిన క‌ష్టం అనీర్వ‌చ‌నీయం.

   ప్ర‌తికూల ప‌రిస్థితులే ఎదుర‌య్యాయి

  ప్ర‌తికూల ప‌రిస్థితులే ఎదుర‌య్యాయి

  వాళ్లిద్ద‌రి కష్టానికి ఈరోజు ఫ‌లితం క‌నిపిస్తుంది. ఇక సినిమా రిలీజ్ టైమ్ లో అన్నీ ప్ర‌తికూల ప‌రిస్థితులే ఎదుర‌య్యాయి. ముర‌ళీ చ‌నిపోయ‌వ‌డం..చెన్నై లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ నా సినిమా పోతుంద‌ని ఒక‌వైపు నా మ‌న‌సు చెప్పినా... మంచి సినిమా క‌ష్ట‌ప‌డి చేశాం త‌ప్పుకుడా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మ‌రో వైపు అనిపించేది.

   ప్రేక్ష‌కులందరికీ నా కృత‌జ్ఞ‌త‌లు

  ప్రేక్ష‌కులందరికీ నా కృత‌జ్ఞ‌త‌లు

  దానంత‌టికీ కార‌ణం ప్ర‌జ‌లే. వాళ్లు నా సినిమాను ఎంత‌గానో ఆద‌రించారు కాబ‌ట్టి స‌క్సెస్ అందుకున్నా. ఇంత స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కులందరికీ నా కృత‌జ్ఞ‌త‌లు" అంటూ చెప్పిన రాజశేఖర్ ఇప్పుడు కూడా పాలకొల్లులో మళ్ళీ అదే ఉద్వేగంతో మాట్లాడాడు

   పాలకొల్లు అడబాల థియేటర్‌లో

  పాలకొల్లు అడబాల థియేటర్‌లో

  ప్రేక్షకుల ఆదరణ బాధల్ని మర్చిపోయేలా చేసిందని హీరో రాజశేఖర్‌ అన్నారు. పాలకొల్లు అడబాల థియేటర్‌లో శుక్రవారం రాత్రి గరుడ వేగ హీరో రాజశేఖర్‌ సందడి చేశారు. అభిమానులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులను సినిమా ఎలా ఉంది...? అంటూ రాజశేఖర్‌ ప్రశ్నించారు.

  ప్రేక్షకుల అభిమానమే

  ప్రేక్షకుల అభిమానమే

  ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకు ఆనందించారు. ప్రేక్షకుల అభిమానమే నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టిందన్నారు. నటి జీవిత మాట్లాడుతూ గరుడ వేగ సినిమాను ఇంతగా ఆదరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

  సినిమాలో నటించబోతున్నా

  సినిమాలో నటించబోతున్నా

  రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని మాట్లాడుతూ త్వరలో తాను సినిమాలో నటించబోతున్నానని, మా తల్లిదండ్రులకు ఇచ్చిన ఆదరణే నాకూ ఇవ్వాలని ప్రేక్షకులను కోరారు. గరుడవేగ సినిమాలో నటించిన చరణ్‌దాస్‌ మాట్లాడుతూ తనకు పాజిటివ్‌ రోల్‌ ఇచ్చి రాజశేఖర్‌ ఎంతో ఉపకారం చేశారని, వారి ఆశీస్సులతోనే గరుడవేగలో బాగా నటించగలిగానని తెలిపారు.

  English summary
  Hero Rajashekhar Daughter Sivani conforms About Her debut as heroine at Garudavega success tour in Palakollu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X