»   »  పొద్దున రిలీజ్.మధ్యాహ్నం కేబుల్ టీవీలో.., తలపట్టుకుంటున్న నిర్మాతలు

పొద్దున రిలీజ్.మధ్యాహ్నం కేబుల్ టీవీలో.., తలపట్టుకుంటున్న నిర్మాతలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉడ్తా పంజాబ్ కి ఏ ముహూర్తాన ఆ పేరుపెట్టారో గానీ అడుగడుగునా కష్టాలే ఎదురౌతున్నాయి. స్వేచ్చగా ఎగరటం అటుంచి వెంట వెణ్టనే సంకెళ్ళు పడుతున్నాయి. ముందు సెన్సార్ సమస్య తరువాత కోర్టు వివాదం.. ఇలా ఒక్కో సమస్య నుంచి బయటపడిన ఈ సినిమాకు ఇప్పుడు పైరసీతో భారీ దెబ్బ తగిలింది.

సినిమా రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో పూర్తి సినిమా పెట్టేయడంతో నిర్మాతలు తల పట్టుకున్నారు. పైరసీపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా, ఆన్ లైన్ లో సినిమా సర్క్యులేట్ అవ్వటాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఇప్పుడు పుదుచ్చేరిలో జరిగిన ఇంకో సంఘటన నిర్మాతలను ఇంకా కష్టాల్లోకి నెట్టింది.

Puducherry cable TV airs 'censor copy' of Udta Punjab

పుదుచ్చేరి లో లోకల్ గా ఉన్న ఒక కేబుల్ చానెల్ లో నిన్న సాయంత్రం "ఉడ్తా పంజాబ్" పైరసీ వెర్షన్ ప్రసారం అయ్యింది... అదే ఏరియాలో ఉండే తమిళ హీరో సూర్య ఈ విశయాన్ని తన ట్విట్టర్ లో తెలపటం తో. ఇండస్ట్రీలో గగ్గోలు రేగింది. ఆ ప్రాంతం లో ఇక తమ కలెక్షన్లకు గండి పడ్డట్టే చెబుతోంది.ఉడ్తా పంజాబ్ బృందం.

సినిమా పైరసీ అయిన దగ్గరనుంచి చిత్ర నిర్మాతలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎంతగా ప్రచారం చేస్తున్నా, పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. సెన్సార్ బోర్దు మీదే అందరి అనుమానాలూ ఉన్న..ఖచ్చితంగా నిరూపుఇంచలేకపోవటం తో సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికైన పైరసీ చేసిన వారిని శిక్షించడానికి కఠిన చట్టాలను ఏర్పాటు చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నారు.,

English summary
A small TV channel in Puducherry, Shakthi TV, aired the entire movie "Udta Punjab" on television. This is like breaking every barrier of piracy..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu