»   » పవన్‌ కళ్యాణ్‌ స్వీట్‌ పర్సన్ అంటున్న హీరోయిన్

పవన్‌ కళ్యాణ్‌ స్వీట్‌ పర్సన్ అంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోస్టార్‌ పవన్‌ కళ్యాణ్ స్వీట్‌ పర్సన్‌. చాలా సైలెంట్‌. తన పనేంటో తను చూసుకుంటారు. ఫెంటాస్టిక్‌ యాక్టర్‌. బాగా ప్రొఫెషనల్ అంటూప్రశంసల వర్షం కురిపిస్తోంది పులి హీరోయిన్ నికిషా పటేల్‌. లండన్‌ లో మోడల్ గా చేసిన ఈ ముద్దుగుమ్మని ముంబైలో ఎస్ జె సూర్య చూసి పవన్ సరసన చేయటానికి సెలక్ట్ చేసారు. పులి రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంలో ఆమెను మీడియా కలిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..చిత్రంలో తన క్యారెక్టర్ గురించి అడిగితే..'హిప్‌-అప్‌' డాన్స్‌లో నేను ఎక్స్ ‌పర్ట్ ‌ని. అది ఈ సినిమాలో మీరు చూడొచ్చు. అంతకు మించి కథ గురించి, నా కేరక్టర్‌ గురించి నేను చెప్పకూడదు. దర్శక, నిర్మాతలు మీకు తెలియపరుస్తారు. జూన్‌ లో సినిమా వస్తోందిగా...అప్పుడు చూడండి అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. అలాగే దర్శకుడు సూర్య గురించి చెబుతూ..చాలా ఫ్రెండ్లీగా వుంటారు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా అంది. సింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రియ ఓ ఐటమ్ సాంగ్ చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu