»   » ‘ఆగని అరెస్టుల మద్య ఆగిన ‘పులి’ ప్రదర్శనలు...

‘ఆగని అరెస్టుల మద్య ఆగిన ‘పులి’ ప్రదర్శనలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కొమరం పులి" విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణావాదుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా పలువురు తెలంగాణా నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తెలంగాణా వాదం బలంగా వినిపించే వరంగల్ రామ్ బిగ్ సినిమా, హన్మకొండలోని అమతా థియేటర్ల ముందు భారీగా తెంగాణా వాదులు చేరుకుని చిత్రానికి సంబంధించిన పోస్టర్లు చించి వేస్తూ ఓయు జేఏసీ పులిని అడ్డుకోవాలంటూ ఇచ్చిన పోస్టర్లను అంటించారు. మరోవైపు నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కొదాడ, నకిరేకల్, భువనగిరి తదితర ప్రాంతాల్లో తెలంగాణా వాదులు చిత్ర ప్రదర్శనని అడ్డుకోవటంతో దాదాపు 70మందిని అరెస్టు చేసినప్పటికీ సినిమా ప్రదర్శించడానికి యాజమాన్యాలు నిరాకరించినట్టు సమాచారం.

అలాగే ఖమ్మం జిల్లాలోని కొత్త గూడెంలో దుర్గ, పూర్ణ థియేటర్ల వద్ద సినిమాని నిలపి వేసినప్పటికీ ఆందోళన కారులు సినిమా పేరు మార్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే మైదరాబాద్ నగర శివార్ల లో కూకట్ పల్లిలోనూ ఈ రోజు చిత్ర ప్రదర్శన రద్దు చేస్తున్నట్లు శివపార్వతి థియేటర్ యాజమాన్యం ప్రకటించగా..నాచారంలోని వైజయంతి ధియేటర్ లోనూ పులి ప్రదర్శనకి బ్రేక్ పడింది. మల్కజ్ గిరి సాయిరాం థియేటర్ ముందు జేఏసి నేత గౌరీష్, వెంకన్నల నేతత్వంలో నిరసన ప్రదర్శన చేయటంతో ప్రదర్శన నిలిపి వేశారు.

కాగా 'కొమరం పులి" ప్రదర్శించే థియేటర్ల ముందు ఆందోళన చేస్తుండటంతో పలుచోట్ల ప్రీమియర్ షోలతో పాటు మార్నింగ్ షో, మ్యాట్నీలను నిలిపివేసేందుకు థియేటర్ యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu