»   » 100 కోట్లే ఎక్కువ అనుకుంటే...150 కోట్లు వసూలయ్యాయి!

100 కోట్లే ఎక్కువ అనుకుంటే...150 కోట్లు వసూలయ్యాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కడ ఓ ఒక సినిమా రూ. 50 కోట్లు వసూలు చేసిందంటే.... బ్లాక్ బస్టర్ హిట్ కిందే లెక్క. ఇంత వరకు ఆ ఇండస్ట్రీలో వంద కోట్ల మార్కును అందుకున్న సినిమానే లేదు. అలాంటి ఇండస్ట్రీలో ఓ సినిమా 150 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

ఆ ఇండస్ట్రీ మళయాల సినీ ఇండస్ట్రీకాగా.... ఆ సినిమా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'పులిమురుగన్'. ఇదే చిత్రం తెలుగులో 'మన్యంపులి'గా రిలీజై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

 Pulimurugan Box Office: Crosses 150-Crore Mark!

తాజాగా మళయాల సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'పులి మురుగన్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్కును అందుకుంది. సినిమా రిలీజ్ ముందే రూ. 15 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ రన్ ద్వారా రూ. 135 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవరాల్ గా రూ. 150 కోట్ల మార్కును అందుకుంది.

రూ. 150 కోట్ల మార్కును అందుకున్న ఫస్ట్ మళయాలం మూవీ మాత్రమేకాదు... సౌత్ సినీ పరిశ్రమలో థర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం రికార్డుల కెక్కింది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం ఇంత పెద్ద హిట్టవ్వడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

English summary
Pulimurugan, the Mohanlal starrer has already emerged as all-time highest grosser of Malayalam movie industry. Now, the Vysakh-directed movie has touched the glorious 150-Crore mark at the worldwide box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu