twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ లాల్ మరో రికార్డ్ , అక్కడ ఏ హీరో కు దక్కనిది

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఓనం స్పెషల్ గా విడుదలైన మలయాళ చిత్రం ఒప్పం 2016లో మోహన్ లాల్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇక ఈ మూవీ తర్వాత రీసెంట్ గా విడుదలైన చిత్రం పులి మురుగన్. ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. పలు ఏరియాలలో ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.

    కొద్ది వారాల క్రితం విడుదలైన పులిమురగన్ చిత్రం రీసెంట్ గా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డ్ ల క్రియేట్ చేసింది. కేరళ భాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపుతూ దూసుకువెళ్తోంది. ఈ చిత్రం భాక్సీఫీస్ గురించి చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటీ అంటే...ఇండియాలోనే కాక బయిట దేశాల్లో కూడా ఆదే స్దాయి స్టామినా చూపుతూ రికార్డ్ లు క్రియేట్ చేయటం.

    Pulimurugan: Hers Is Another Record Set By The Movie!

    ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల అయ్యింది. అమెరికాలోనూ, గల్ఫ్ కంట్రీల్లోనూ 630 షోలు మొదటి రోజు ఈ సినిమాకు పడ్డాయి. సల్మాన్ ఖాన్ సుల్తాన్, రజనీకాంత్ కబాలికు కూడా ఈ రికార్డ్ దక్కలేదు.

    ఇక్కడితో ఈ చిత్రం రికార్డ్ లు ముగిసిపోలేదు. పోలెండ్ లో విడుదలైన తొలి మళయాళి చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వారంలోనే అక్కడ రిలీజ్ చేసారు. ఇప్పటికే బ్రిటన్ మరియు యూరప్ దేశాల్లో కూడా ఈ సినిమా రిలీజైంది. పోలెండ్ లో విడుదలైన విషయాన్ని పీటర్ హెయిన్స్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియచేసారు.

    ఈ చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి' పేరుతో ప్రముఖ నిర్మాత సింధూరపు పువ్వు కృష్ణారెడ్డి నవంబర్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య మనమంతా, జనతా గ్యారేజ్ అనే చిత్రాలతో ఇక్కడి ఆడియన్స్ ను అలరించిన ఈ లెజండరీ యాక్టర్ త్వరలో మన్యం పులి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

    ఇప్పటికే 'మన్యం పులి' సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ముగిశాయి. పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్ తెలిపారు. జనతా గ్యారేజ్ సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాట ఫుల్ క్రేజ్ రావడంతో, అదే...ఊపులో మన్యంపులి సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

    Pulimurugan: Hers Is Another Record Set By The Movie!

    దీంతో సాధ్యమైనంత త్వరగా నవంబర్ లో మన్యం పులి ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత కృష్ణా రెడ్డి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటుఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర యూనిట్ తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు.

    కథ గురించి చెప్తూ...''అటవీ సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తాడు అతను. వెదురు బొంగులు విక్రయిస్తుంటాడు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లినప్పుడు పలు జంతువులతో ముఖ్యంగా పులులతో పోరాడాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తికరం'' అన్నారు నిర్మాత 'సింధూరపువ్వు కృష్ణారెడ్డి'.

    English summary
    Mohanlal starrer Pulimurugan has become one of the biggest hits in the history of Malayalam cinema. The movie is getting released even in those places where Malayalam movies are not having a big market.Peter Hein, who has choreographed the action sequences for the film, took to Facebook to officially announce the release of the movie in Poland.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X