»   » జాకీగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడవ తనయుడు తెలుగులో...

జాకీగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడవ తనయుడు తెలుగులో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కర్ణాటక అన్న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తృతీయ పుత్రుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడంలో సంచలన విజయం సాధించిన 'జాకీ' చిత్రాన్ని అదే పేరుతొ శ్రీమతి పార్వతమ్మ రాజ్ కుమార్ సమర్పణలో సూరజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి నాదెళ్శ సుజాత నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కన్నడంలో ఈసినిమా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేయడంతో మొట్ట మొదటిసారి కన్నడ పవర్ స్టార్ రాజ్ కుమార్ జాకీ సినిమాని హైదరాబాద్‌లోని సూపర్ గుడ్ స్టూడియోలో డబ్బింగ్ చెప్పించడం జరుగుతుందని, త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

ఈ సందర్బంలో నిర్మాత నాదెళ్శ సుజాత మాట్లాడుతూ 'కన్నడ మహానటుడు మరియు కర్ణాటక అన్న అయిన రాజ్ కుమార్ మూడవ తనయుడైన పునీత్ రాజ్ కుమార్ తొలిసారిగా ఈ 'జాకీ' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం జరుగుతుంది. యూనిఫాం లేని పోలీస్ ఆఫీసర్ లా సమాజాన్ని బాగుచేసే ఓ పవర్ ఫుల్ యువకుడుగా ఈ చిత్రం లో పునీత్ ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తాడు. అమాయక ఆడపిల్లలను విదేశాలకు తరలించే ముఠాను శక్తి యుక్తులతో చేదించి ఆ ముఠా గుట్టును రట్టు చేసే పాత్రలో పునీత్ రాజ్ కుమార్ పాత్ర కోనసాగుతుందని అన్నారు.

ఈ రాకెట్ ముఠా లో చిక్కుకున్న అమాయక అమ్మాయిగా హీరోయిన్ భావన నటించింది. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ లవ్ సన్నివేశాలు చాలా అద్భుతంగా వుంటాయి. హరికృష్ణ సంగీతసారధ్యంలో రూపొందిన 5 అద్భుతమైన పాటలు ఫారిన్ లోకేషన్స్ లో ఎంతో రిచ్ గా చిత్రీకరించడం జరిగింది. మాస్ ను అలరించి 5 ఫైట్స్ చిత్రంలో హై లైట్ గా వుంటాయి. ఈ వారమే ఆడియోను ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేయనున్నాం' అని అన్నారు.

English summary
Jackie is the home production of Kannada Movie icon Late Dr. Raj Kumar and Raghavendra Rajkumar who has been fully involved in the production activities. Already the talkie portions of the film has been completed in Kushalnagar forests, Bangalore and Mysore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu