Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరు 150 అంటే ఆ మాత్రం ఉండొద్దూ.... దేవిశ్రీ ఏం చేసాడో తెలుసా?
హైదరాబాద్: అందరికీ మ్యూజిక్ కొట్టినట్లే చిరంజీవి 150వ సినిమాకు మ్యూజిక్ కొడితే స్పెషల్ ఏముంటుంది. అందుకే తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నాడు సౌత్ సెన్సేషన్, తెలుగు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.
టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో పాడించేందుకు... ఇప్పటి వరకు తెలుగులో పాడని, బాలీవుడ్లో, పంజాబీలో బాగా పాపులర్ అయిన సింగర్లను రంగంలోకి దించారు.
గతంలో దేవిశ్రీ అపాచె ఇండియన్, రఘు దీక్షిత్, బాబా సెహగల్, నేహా బాసిన్ లాంటి బాలీవుడ్ సింగర్లను టాలీవుడ్ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హాట్ పంజాబీ సెన్సేషన్ సింగర్ జాస్మిన్ సండ్లాస్ తో చిరంజీవి 150వ సినిమాకు పాడించారు.

ఎవరీ జాస్మిన్ సండ్లాస్
జాస్మిన్ సండ్లాస్ యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన సింగర్. హిందీలో కిక్, వన్ నైట్ స్టాండ్ లాంటి సినిమాలకు పాడారు. తాజాగా ఆమె చిరంజీవి 150వ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతోంది.

మెగాస్టార్ గురించి జాస్మిన్ ట్వీట్
మెగా స్ఠార్ చిరంజీవి 150వ సినిమాకు పాడటం చాలా ఆనందంగా ఉందని, రికార్డింగ్ పూర్తయింది. ఈ అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

షూటింగ్ వేగంగా
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి విడుదల చేసి మెగా అభిమానుల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకుడు వివి వినాయక్.

పాటలకు, డాన్స్ లకు పెట్టింది పేరు
చిరంజీవి సినిమాలు అంటేనే మంచి ఊపుండే పాటలకు, డాన్స్ లకు పెట్టింది పేరు. బ్రేక్ డాన్స్ లాంటి వాటిని తెలుగు తెరకు పరిచయం చేసిందే ఆయన. చిరంజీవి ఇంత పెద్ద స్టార్ కావడానికి ఆయన డాన్సింగ్ టాలెంట్ కూడా ఓ కారణం.

వీణ స్టెప్ ఎవర్ గ్రీన్
తన మార్కు ఉండేలా సినిమాల్లో ప్రత్యేకమైన స్టెప్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఆయనకు ముందు నుండీ అలవాటే. ‘ఇంద్ర'లో చిరంజీవి వేసిన వేసిన వీణ స్టెప్ ఎవర్ గ్రీన్.

150వ సినిమాలో కూడా
ప్రస్తుతం చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ల్యాండ్ మార్క్ మూవీ ‘ఖైదీ నెం. 150)లో కూడా ప్రత్యేకంగా డాన్సులు, ఎప్పటికీ గుర్తుడి పోయే స్టెప్‌లు ఉంటాయని భావిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభిమానులకు కావాల్సిన మసాలా అంతా దట్టించి దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట.

సంక్రాంతికి
రామ్ చరణ్ స్వయగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా చేస్తోంది. తరుణ్ అరోరా, అలీ, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేథరిన్ ఓ పాటలో చిరుతో కలిసి ఆడిపాడనుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.