»   » పెళ్లి చేసుకుంటానని మహిళపై సింగర్ రేప్

పెళ్లి చేసుకుంటానని మహిళపై సింగర్ రేప్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Punjabi singer Nachhattar Gill arrested for rape
చండీగడ్: ఓ మహిళపై అత్యాచారం జరిపాడనే ఆరోపణపై పాపులర్ పంజాబీ సింగర్ నచ్చత్తార్ గిల్‌ను పోలీసులు గురువారంనాడు అరెస్టు చేసారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను ఆమెపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం మహిళ లూథియానా పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేసింది.

కొన్నేళ్ల క్రితం మహిళకు ఆ సింగర్ చేరువయ్యాడని, ఆమెతో స్నేహం చేశాడని ఇండియా టుడే వార్తాకథనం తెలియజేస్తోంది. పెళ్లి చేసుకుంటానని అతను ఆమెకు హామీ ఇచ్చాడని, దాంతో ఆమె లైంగిక సంబంధానికి ఒప్పుకుందని ఆ వార్తాకథనం సారాంశం.

అయితే, అతను హామీని నిలబెట్టుకోలేదని, దాంతో ఆగ్రహించిన మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిందని, తనపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించిందని అంటున్నారు.

తొలుత సింగర్‌పై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనకాడారని, మహిళ కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో కేసు నమోదు చేసి, గురువారంనాడు అతన్ని అరెస్టు చేశారు.

Read more about: punjab పంజాబ్
English summary
Popular Punjabi singer Nachhattar Gill was arrested yesterday for allegedly raping a woman on the pretext of marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu