»   » తమ్ముడు బాలకృష్ణ ఓ ఉగ్రనరసింహం...పురందేశ్వరి

తమ్ముడు బాలకృష్ణ ఓ ఉగ్రనరసింహం...పురందేశ్వరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమ్ముడు బాలకృష్ణ ఓ నటసింహంలా, ఓ ఉగ్రనరసింహంలా తనలోని నటనని చాటుకున్న చక్కని సందేశాత్మక చిత్రం ఇదని భావిస్తున్నా. నేడు ఒక పౌరాణికం కానీ, ఒక జానపదం కానీ, ఒక సాంఘికం కానీ చెయగల నటుడు ఒక్క బాలకృష్ణ మాత్రమే. తమ్ముడు సంపూర్ణ నటుడు అని చెప్పగలను అన్నారు కేంద్ర మంత్రి పురందేశ్వరి.

రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన వంశీ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటుచేసిన సభలో ఆమె పరమవీరచక్ర చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..."నా యాభయ్యోయేట దాసరి 150వ చిత్రంలో నటించడం చాలా సంతోషం. ప్రతి పౌరుడూ వీర జవాను కావాలనీ, అలాంటి చట్టం తేవాలనీ కోరుతున్నా అన్నారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మాట్లాడుతూ "మన సైనిక శక్తిని బాలకృష్ణ తన పాత్రలో అద్భుతంగా ప్రదర్శించారు. 150 కాదు, ఇంకో 150 సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్న దర్శకుడు దాసరి. నాలుగు రోజుల తర్వాతైనా ఈ చిత్రాన్ని ప్రేక్షకలోకం ఆదరిస్తుంది. ఇది ఉత్కృష్టకోవకు చెందిన చిత్రం" అని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu