'ఇద్దరమ్మాయిలతో' లో కులాల డైలాగులపై పూరీ వివరణ
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... '' 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో కొన్ని సామాజిక వర్గాల గురించి ఎక్కువగా ప్రస్తావించానని అంటున్నారు. విదేశాల్లోనూ కులాల గురించి మాట్లాడుకుంటారా అని అడుగుతున్నారు. మనుషులు ఎక్కడికెళ్లినా ఒక్కటే. కులాల ప్రస్తావన అన్ని చోట్లా ఉంది. అయినా నేను సినిమాల్లో ఎవరినీ కించపరచలేదు. ఓ సామాజిక వర్గం గురించి సరదాగా నేను రాసిన డైలాగ్‌కి అందరూ నవ్వుకుంటున్నారు. అది సరదాకి చేసిన పనే. దాంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు అన్నారు.
అలాగే... నేను రాస్తున్న డైలాగ్స్‌నే మళ్లీ రాసేస్తుంటాను. ఒక్కోసారి నా సహాయకులు చెప్తూ ఉంటారు. అంతేగాని అవి కావలని చేసినవి కావు. ఈ సినిమా క్త్లెమాక్స్‌లో కేథరిన్ చెప్పిన డైలాగ్ 'బద్రి' క్త్లెమాక్స్‌లో రేణుదేశాయ్ చెప్పిన డైలాగ్‌లా ఉందంటున్నారు. సందర్భం ఉంది కాబట్టే అలాంటి మాటలొచ్చాయి అంతే. ఈ సినిమాకి సీక్వెల్ ఆలోచన లేదు అని తేల్చి చెప్పారు.
ఇక ''కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో నేను రాసిన 'ఎక్స్‌ట్రార్డినరీ' డైలాగ్‌కు మంచి స్పందన వచ్చింది. అబ్బాయిలతోపాటు.. అమ్మాయిలకు నచ్చింది. నన్ను కొందరు కలిసినప్పుడు అలాంటివి రాయమని అడిగారు. అందులో అమ్మాయిలూ ఉన్నారు. వారి కోసమే దీంట్లో అమ్మాయిల్ని ఆటపట్టించే సంభాషణల్ని రాశాను. పవన్ కల్యాణ్ గురించిన సంభాషణ కేవలం సరదా కోసం రాసిందే. అందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు'' అని క్లారిఫై చేసారు.


Click it and Unblock the Notifications












