»   » పేరు మార్చుకున్న యంగ్ హీరో.. ఇప్పటికైనా హిట్ వస్తుందా?

పేరు మార్చుకున్న యంగ్ హీరో.. ఇప్పటికైనా హిట్ వస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సినిమావాళ్లకు నమ్మకాలు ఎక్కువ. సినిమా టైటిల్ నుంచి లెక్కలు వేసి మరీ పెడుతూంటారు. అలాగే తమకు కలిసి రాకపోతే తన పేరులోనే ఏదో సమస్య ఉందని మారుస్తూంటారు. తాజాగా పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కు తొలి నుంచీ ఫ్లాఫుల వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడూ బంపర్ ఆఫర్ లాంటివి తగిలినా వాటికి నిలకడ తక్కువని తేలిపోయింది. దాదాపు ఫేడవుట్ అయ్యే స్ధితిలో ఉన్న సాయి రామ్ శంకర్ ఇప్పుడు పేరు మార్చి రంగంలోకి దూకుతున్నాడు.

న్యూమరాలిజీ ప్రకారం పేరు మారిస్తే కలిసివస్తుందని నమ్మి తన తాజా చిత్రం 'వాడు నేను కాదు' తో ఆ పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన పేరు.. రామ్ శంకర్ . సాయి అనే రెండు అక్షరాలు తీసేసారు. మరి ఈ సారి అయినా ఆయన హీరోగా నిలదొక్కుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Puri brother changed his name

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజా చిత్రం విషయానికి వస్తే...

రామ్‌శంకర్‌, మహిమా నంబియార్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'వాడు నేను కాదు'. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో తెరకెక్కుతోంది. వినోద్‌ విజయన్‌ దర్శకుడు. రవి పచ్చముత్తు, కె. మోహనన్‌, వినోద్‌ విజయన్‌ నిర్మాతలు. ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి రవి పచ్చ ముత్తు క్లాప్‌నిచ్చారు. ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. నిర్మాత ఎ.ఎం. రత్నం గౌరవ దర్శకత్వం వహించారు.

రామ్‌ శంకర్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రం కోసం ఆరుగురు జాతీయ అవార్డు విజేతలు పనిచేయడం నా అదృష్టం. నేను ఎదురు చూస్తోన్న మలుపు ఈ చిత్రంతో లభిస్తుందనే నమ్మకం ఉంది''అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ప్రేక్షకులు కోరే అన్ని అంశాలతో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. రామ్‌శంకర్‌ రెండు పాత్రల్లో కనిపిస్తాడు'' అన్నారు.

కార్యక్రమంలో పూరి జగన్నాథ్‌, నిర్మాత మహేష్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌, సత్యం శ్రీరంగం, రాజీవ్‌ రవి, వివేక్‌ హర్షన్‌, విశ్వా, రెహమాన్‌, విద్యాసాగర్‌, అలీ, కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.

English summary
Now same like other heroes Sairam Shankar has resorted to numerology and changed his name. As per reports Sairam Shankar rechristened as Ram Shankar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu