»   » వావ్..! మళ్ళీ ఆ క్రేజీ కాంబినేషన్..!? పూరీ విత్ చిరు

వావ్..! మళ్ళీ ఆ క్రేజీ కాంబినేషన్..!? పూరీ విత్ చిరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నగరమైనా... టౌన్ అయినా...మారుమూల పల్లెటూరైనా ఒకప్పుడు చిరంజీవికి ఉండే క్రేజ్ వేరు. రాజకీయాల్లోకి వచ్చాక కాస్త తగ్గింది కానీ. చిరు అంటే టలీవుడ్ రారాజు. అయితే ఎప్పుడైతే ప్రజారాజ్యం అనే పార్టీ మొదలుపెట్టారో నెమ్మదిగా చిరంజీవి నుంచి మెగాస్టార్ అన్న ట్యాగ్ కాస్త పక్కకు జరిగింది. కేవలం రాజకీయాలకే పరిమితమైపోవటం తో మునుపటి క్రేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు చిరు మళ్ళీ మెగా స్టార్ వెలుగులని చూపించాల్సిన సమయం వచ్చింది. రాబోయే ఎన్నికల లోపు మళ్ళీ పూర్వం ఉన్న అదే ఫాలోయింగ్ ని తెచ్చుకుంటే మరింత ప్లస్ ఔతుంది.

ఈ నేపథ్యం లో 150వ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోతారా లేదంటే సినిమాల్లోనే కంటిన్యూ అవుతారా..? ఇప్పుడు ఇదే అభిమానుల్లో మెదిలే ప్రశ్న. దీనికి సమాధానం కూడా వచ్చేసింది.చిరంజీవి ఇకపై సినిమాలతో బిజీ కావాలని ఫిక్సైపోయాడు. 2019లో ఎన్నికలు వచ్చేవరకు రాజకీయాల్లో చిరు చేసేదేదీ లేదు.

Puri getting ready with Auto Jhonny Once again

కాంగ్రెస్‌ పరిస్థితి కూడా ఇప్పుడు బాగోలేదు. ఇలాంటి టైమ్‌ లో పోయిన క్రేజ్‌ ను మళ్లీ దక్కించుకోవాలంటే చిరు ముందున్న ఏకైక మార్గం సినిమాలు. దీనికి నిదర్శనంగా ఇప్పటికే బోయపాటికి తన కోసం ఓ కథ సిద్ధం చేయాలని హింట్‌ ఇచ్చాడు చిరంజీవి. బోయపాటి కూడా మెగాస్టార్‌ కోసం కథ వండే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో వార్త కూడా బయటికి వచ్చింది.

అప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్‌ తో ఆటోజానీ సినిమా అనౌన్స్‌ చేసి ఆపేసాడు చిరంజీవి. సెకండాఫ్‌ నచ్చక సినిమా వదిలేసాడు మెగాస్టార్‌. ఆ తర్వాత పూరీ కూడా ఆటోజానీ గురించి ఆలోచించలేదు. తన పని తాను చేసుకుంటున్నాడు. చిరంజీవి కూడా కత్తి రీమేక్‌ తో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆటోజానీని అటకెక్కించారు. మళ్లీ ఇప్పుడు ఆ సినిమా తెరపైకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌ ఈ మధ్యే పూర్తి చేసిన పూరీ.. చిరంజీవికి చెప్పి ఒప్పించాడని సమాచారం. కత్తి రీమేక్‌ తర్వాత చిరు చేయబోయే సినిమా ఆటోజానీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
The Crazy project Aoto Jani which is Announced and Cancelled by Puri jagannath with Megastar chiranjeevi is ready to move on the sets again with same combination...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu