»   » చిరంజీవి 150 నేనే చేస్తా, నాకే హక్కుంది: పూరి

చిరంజీవి 150 నేనే చేస్తా, నాకే హక్కుంది: పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో 150వ సినిమా రద్దు కావడంపై పూరి జగన్నాథ్ స్పందిస్తూ....కథ రెడీ చేసుకొని ఆయనకు చెప్పాను. ఫస్ట్ హాఫ్ విని చాలా బావుందన్నారు. ఫుల్ స్క్రిప్ట్ విన్న తరువాత నేను కబురు చేస్తానని చెప్పారు. కాని మీడియా ముందు సెకండ్ హాఫ్ నచ్చలేదు. అందుకే పూరితో సినిమా చేయట్లేదని చెప్పారు. ఒకవేళ ఆయన నాతో చెప్పి ఉంటే మార్పులు చేసి మరోసారి వినిపించేవాడ్ని. కాని చిరంజీవి గారు మాత్రం అలా చేయలేదని వ్యాఖ్యానించారు.

అయితే పూరి జగన్నాథ్ చిరంజీవి గురించి ఇలా వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూరి వ్యాఖ్యలు అభ్యంతర కరంగా ఉన్నాయంటూ మరో వైపు అభిమానులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసారు పూరి.

Puri inner feelings about Chiru's 150th film

చిరంజీవిగారి 150వ సినిమా చేయడానికి నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకి పెద్ద అభిమానిని. ఆయన తెర మీద ఎలా ఉంటే బావుంటుందో ఫ్యాన్స్ కే బాగా తెలుసు. ఆయనకు కూడా తెలీదు. ఈకథ కుదరక పోతే ఇంకో కథ చేస్తా.. అదీ కుదరక పోతే ఆయనకు నచ్చే వరకు చేస్తా. 150వ నేనే చేస్తా... లేదంటే 151 చేస్తాం.. ఎప్పటికైనా చిరంజీవిగారితో సినిమా చేయాలనేదే నా కోరిక అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసాడు పూరి.

Posted by Puri Jagannadh on Wednesday, September 30, 2015

పూరి జగన్నాథ్ మీడియా ముఖంగా చిరంజీవిపై చేసిన కామెంట్స్ వల్ల రామ్ చరణ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి తాజాగా పూరి జగన్నాథ్ ఇచ్చిన వివరణతో ఇటు రామ్ చరణ్... అభిమానులు కూల్ అవుతాడా? లేదో? చూడాలి.

English summary
"I will surely direct Chiru's 150th film, and if not this film, will surely direct his 151st film," said an emotional Puri Jagannadh.
Please Wait while comments are loading...