»   » 'హార్ట్‌ఎటాక్‌' టైటిల్ అందుకే పెట్టా : పూరి జగన్నాథ్‌

'హార్ట్‌ఎటాక్‌' టైటిల్ అందుకే పెట్టా : పూరి జగన్నాథ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు గుండెలో ఎలా ఉంటుందో... ప్రేమించిన అమ్మాయిని విడిచిపెట్టాలంటే అలానే ఉంటుంది. అలాంటి బాధని అనుభవించిన యువకుడి కథ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది'' పూరి జగన్నాథ్‌ అన్నారు.

నితిన్ మాట్లాడుతూ... వరుణ్‌ జీవితం సాదాసీదాగా సాగిపోతోంది. ఒక రోజు అందమైన అమ్మాయిని చూశాడు. బాగుంది కదా అని ఒక్క ముద్దు అడిగాడు... ఆ మాత్రం దానికే ఇది ప్రేమేనని ఆ అమ్మాయి తేల్చేసింది. ఆమె బాధ్యతలు... బిల్లులు తన మీద పడేయాలని చూసింది. అంత భారం అవసరమా అని లైట్‌ తీసుకున్నాడు. అయితే ఆమెని పట్టించుకోవడం మానేశాకే తెలిసింది ఆమెని ప్రేమిస్తున్నాడని. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మా సినిమా అంటున్నారు నితిన్‌.

Puri Jagan about his latest Heart Attack film

పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ ''సినిమాకి అనూప్‌ అందించిన సంగీతం ప్రధానాకర్షణ. 'ఇడియట్‌' సమయంలోనే ఇద్దరం కలసి పనిచేయాల్సింది. అయితే ఇప్పటికి కుదిరింది. నా నుంచి చాలా రోజులతర్వాత వస్తున్న ప్రేమకథా చిత్రమిది. భాస్కరభట్ల అందించిన పాటలు సినిమాకి కొత్తఅందాన్నిచ్చాయి''అన్నారు.

పూరి జగన్నాథ్‌తో ఓ మంచి సినిమా చెయ్యాలన్న నా కోరిక ''హార్ట్ ఎటాక్''తో నెరవేరుతోంది. నాకు ''హార్ట్ ఎటాక్'' సినిమా చాలా టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకం వుంది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. కామెడీ, రొమాన్స్, లవ్, మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయి. సినిమా సూపర్‌గా నచ్చింది. గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది. అనూప్ మంచి సంగీతం అదించారు. భారస్కర భట్ల లిరిక్స్ బాగున్నాయి.' అన్నారు.

నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. అదాశర్మ హీరోయిన్. ఈ నెల 31న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: భాస్కరభట్ల, సినిమాటోగ్రఫి అమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సమర్పణ: లావణ్య, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - నిర్మాత - దర్శకత్వం - పూరి జగన్నాథ్.

English summary
Nithin said that Heart Attack is an emotional love story. He vouched that this film will become one of the biggest musical love story in Tollywood. Nithin also said that he wanted to act under Puri Jagganadh’s direction post his first film Jayam. After long it has happened again with Heart Attack.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu