»   » పూరి జగన్నాధ్, అమితాబ్ ల సినిమా ప్రారంభం

పూరి జగన్నాధ్, అమితాబ్ ల సినిమా ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బి అమితాబ్ బచ్చన్, పూరి జగన్నాద్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ నిన్న అనగా సోమవారం(మార్చి 7, 2011) ముంబైలో మొదలైంది. 'బుడ్డా బన్గయా తేరా బాప్' పేరుతొ ఈ చిత్రం రూపొందుతుంది. హేమమాలిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోమారో ముగ్గురు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో ఒకరిగా చార్మీ ఎంపికయ్యారు. కాగా మొదటిరోజు షూటింగ్ లో అమితాబ్ పాల్గొనలేదు. ఈ నెల 23 నుంచి జరగనున్న రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. పూరి జగన్నాద్ దర్శకత్వం వహిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రమిది. ఇక పూరి రూపొందించిన నేనూ నా రాక్షసి చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం మహేష్ కాంబినేషన్ లో ది బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రారంభిస్తారు.

English summary
Puri Jagannadh has begun filming his Hindi film with Amitabh Bachchan. The film's first day shot was filmed this morning (Monday, March 07, 2011) in Mumbai. Titled Buddah..hoga terra baap!, the film stars Amitabh Bachchan in the lead role. Hemamalini is his heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu