»   »  పవన్ కోసమే ఆ డ్రామా ఆడా:పూరీ

పవన్ కోసమే ఆ డ్రామా ఆడా:పూరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Puri Jagan remembers Badri Days
హైదరాబాద్ : తెర వెనక సంగతులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాల గురించి అయితే మరీను. పవన్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పెద్ద హిట్ చిత్ర'బద్రి'. ఈ చిత్రం మొదలు కావటానికి ముందు పూరీ జగన్నాథ్ కెరీర్ లో చెప్పుకోవటానికి ఏమీ లేదు. దాంతో పవన్ ని కలవటానికి ఓ డ్రామా ఆడారు. ఈ విషయం గురించి పూరి జగన్నాథ్‌ 'దిల్లున్నోడు' పాటల వేడుకలో ఓ ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు.

పూరి మాట్లాడుతూ... బద్రి తమాషా కథ. ఓ అబ్బాయి ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తాడు. నిజానికి ఈ కథ ఎవరికి చెప్పినా ఒప్పుకోరు. కానీ సరిగ్గా తీస్తే ప్రేక్షకులు నెత్తిమీద పెట్టుకొంటారని నాకు తెలుసు. అప్పటికి నాకు పవన్‌ కల్యాణ్‌తో పరిచయం లేదు. శ్యామ్‌ కె.నాయుడు ద్వారా చోటా కె.నాయుడుని కలుసుకొన్నా. 'నాకు కథ వినిపించు. నచ్చితే పవన్‌కి సిఫారసు చేస్తా' అన్నారు.

నా కథను చోటా.కె. సరిగ్గా అర్థం చేసుకొంటారో లేదో అని.. ఆయనకు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' కథ చెప్పా. అది చోటాకి బాగా నచ్చింది. వెంటనే పవన్‌కి నన్ను పరిచయం చేశారు. పవన్‌ కల్యాణ్‌కి 'బద్రి' కథ వినిపించా. తనకి కథ నచ్చింది గానీ, 'ఏదో ఆత్మహత్య కథ అన్నాడు.. నువ్వేమో ఇది చెప్పావ్‌..' అని అడిగారు. 'మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఆడిన డ్రామా అది..' అని నిజం చెప్పేశా. అలా నా మొదటి సినిమా 'బద్రి'కి అంకురార్పణ జరిగింది అన్నారు.


నితిన్ హీరోగా నటించిన తన తాజా చిత్రం హార్ట్ ఎటాక్ భారీ ఓపెనింగ్స్ సాధించిందని, విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని పూరీ జగన్నాథ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'తొలిరోజు నైజాం ఏరియాలో ఒక కోటి తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసి నితిన్ సినిమాల్లో రికార్డ్ నెలకొల్పింది. మిగతా ఏరియాల్లోనూ కలెక్షన్లు చాలా బాగున్నాయ'ని పూరీ జగన్నాథ్ చెప్పారు.

English summary
Writer-director Puri Jagannadh has spilled beans on his directorial venture Badri which has Pawan Kalyan in the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu