»   » వీడియో: అన్నపూర్ణ సుంకరకు పూరి జగన్నాథ్, అలీ కౌంటర్

వీడియో: అన్నపూర్ణ సుంకరకు పూరి జగన్నాథ్, అలీ కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా ధోరణులపై విరుచుకు పడ్డ ఎన్నారై అన్నపూర్ణ సుంకర ని ఉద్దేశిస్తూ ఆమె తీసిన వీడియో కు కౌంటర్ గా అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్, అలీ లను ఉద్దేశించి ఆమె చేసిన కామెట్లకు వారి అభిమాని ఒకరు ఇదిగో ఇలా కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ ఎలా ఉందో మీరూ చూడండి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఆమె వీడియోలో...తెలుగు సినిమాల్లో హీరోయిన్లు కొన్ని సీన్లలో నీచంగా చూపిస్తున్నారు, హీరోయిన్ల బట్టలు బలవంతంగా విప్పే సన్నివేశాలను హీరోయిజంలా చూపిస్తున్నారు. పెద్ద వాళ్లను కొట్టే సన్నివేశాలతో కామెడీ చేస్తున్నారు.

Puri Jagannadh And Ali Counter To Annapurna Sunkara, Who Bashed Telugu Films

ఇలాంటి సన్నివేశాలతో మన తెలుగు సినిమా దర్శకులు సమాజానికి, యువతరానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఓ సగటు మహిళ గా సోషల్ మీడియా వేదికగా తెలుగు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ఇతర దర్శకులపైనా....అలాంటి సీన్లలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇతర లాంటి వారిపైనా విమర్శనాస్త్రాలు గుప్పించింది.

సినిమాల్లో హీరోయిన్లకు జరిగినట్లు నిజ జీవితంలో మీ తల్లికో, చెల్లికో జరిగితే మీరు ఎలా సహిస్తారు. ఇంట్లో పిల్లలు తమ కంటే వయసులో పెద్దవాళ్లను కొడితే సహిస్తారు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెడితే అది క్రమ క్రమంగా మన జీవితాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. కేవలం సినిమా వాళ్లపైనే కాదు...ఇలాంటి సీన్లను తప్ప బట్టకుండా ఉంటున్న సామాన్య ప్రేక్షకులపైనా ఆమె విమర్శలు గుప్పించారు.

English summary
A Telugu NRI lady has become an over-night sensation on social networking sites after bashing Telugu films in a video that went viral. The latest to add to the on going saga, was a reply from Ali and Puri Jagannadh, whom she bashed in the video.
Please Wait while comments are loading...