Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Liger అయిపొయింది, ఇక జనగణమన.. నోరు విప్పిన పూరీ.. బాలీవుడ్ మహామహులతో భారీ ప్లాన్!
పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన విజయదేవరకొండ చేయబోతున్నాడు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుతో చేయాల్సిన ఆ సినిమా విజయ్ దేవరకొండతో చేస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చిన నేపథ్యంలో ఈ విషయం మీద పూరి జగన్నాథ్ అధికారికంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

పాన్ ఇండియా లెవెల్ లో
టెంపర్ సినిమా తర్వాత చాలా కాలం పాటు అనేక సినిమాలు చేసి అపజయాలు అందుకున్న పూరి జగన్నాథ్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆ సినిమా తర్వాత ఆయన రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతోంది.

రౌడీ ఫ్యాన్స్ వెయిటింగ్
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్ ను కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తర్వాత దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
త్వరలో జనగణమన
అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని పూరి జగన్నాథ్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అంటూ పూరి జగన్నాథ్ చెబుతున్న 11 సెకన్లు వాయిస్ మెసేజ్ ని ఈ సినిమా నిర్మాత ఛార్మి కౌర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వాయిస్ క్లిప్ లోనే పూరి జగన్నాథ్ జనగణమన సినిమా గురించి కూడా హింట్ ఇచ్చాడు. ఇప్పుడు చేస్తున్న లైగర్ సినిమా పూర్తయింది ఇక త్వరలో జనగణమన అంటూ ఆయన పేర్కొన్నారు.

మహేశ్ బాబుతో
ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కోసం వారు కలలు కంటూ ఉంటారు. పూరి జగన్నాథ్ కు అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే జనగణమన, ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టా లెక్కించేందుకు పూరీ అన్నీ సిద్ధం చేశారు. నిజానికి బిజినెస్ మెన్ తర్వాత మహేశ్ బాబుతో పూరి చేయాల్సిన చిత్రమిది. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత వీరిద్దరు ఈ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ అటక ఎక్కింది.

మహామహులతో
అయితే తాజా సమాచారం మేరకు జనగణమన వైపు పూరి మళ్లీ దృష్టి పెట్టారు. లైగర్ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ లాంటి మహామహులతో పాన్ ఇండియా లెవల్లో జనగణమన ప్లాన్ చేస్తున్నాడట పూరి. విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమాతో మంచి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంటారు కాబట్టి ఇక ఈ ప్రాజెక్ట్ ఆయనతో చేస్తే మరింత బూస్ట్ అవుతుందని భావిస్తున్నారు.