»   »  పూరీ జగన్నాథ్ కొత్త బ్యానర్ లోగో (ఫోటో)

పూరీ జగన్నాథ్ కొత్త బ్యానర్ లోగో (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : పూరీ జగన్నాథ్ ఇక నుంచి కొత్త బ్యానర్ పై స్వయంగా సినిమాలు నిర్మించనున్నారు. అందుకోసం ఆయన పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పేరుతో ఓ బ్యానర్ లోగో డిజైన్ చేయించారు. ఇంతకు ముందు ఆయన వైష్ణో అకాడమీ పై ఇడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, పోకిరి తదితర చిత్రాలు నిర్మించారు. ఇప్పుడు నితిన్ చేస్తున్న చిత్రాన్ని ఈ కొత్త బ్యానర్ పై రూపొందించనున్నారు.

బ్యానర్ కు ఈ టైటిల్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం లేదని, తన చిన్నప్పుడు తమ థియోటర్ కి అదే పేరు ఉండేదని అన్నారు. ఈ విషయమై పూరీ ట్వీట్ చేస్తూ... "నేను ఎక్కువగా ఆ థియోటర్ లోనే సినిమాలు చూసాను ," అన్నారు. అందుకే ఈ పేరు పెడుతున్నాను అన్నారు.

ఇక హార్ట్ ఎటాక్ విషయానికి వస్తే.. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. త్వరలో ఈచిత్రంలో హీరోయిన్ వివరాలతో పాటు సాంకేతిక విభాగం వివరాలు వెల్లడికానున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత గోవా, యూరఫ్‌లలో భారీ షెడ్యూల్ జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు. ఇక్కడ సినిమా ప్రధాన తారగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరి నితిన్ ను కొత్త స్టైల్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ 'పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను' అన్నారు. ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు.

English summary
Director Puri Jagannadh has floated a new banner - Touring Talkies. His next film Heart Attack with Nithin and Adah Sharma will be made on this new banner. He didn't provide the reason for this new banner but he said that their family owned a theatre by the same name in his childhood. "I used to watch movies in that theatre," he tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu